Telugu Global
Others

స్వచ్ఛాంధ్రప్రదేశ్‌ లక్ష్యంగా సాగుదాం: చంద్రబాబు పిలుపు

స్వచ్ఛ భారత్‌లో ఆంధ్రప్రదేశ్‌ను అగ్రస్థానంలో ఉంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి ఎన్‌. చంద్రబాబునాయుడు పిలుపు ఇచ్చారు. ఇతర దేశాల్లో పరిశుభ్రతకు అగ్ర పీఠం వేస్తారని, కాని భారతదేశంలో తమ పక్కనే అపరిశుభ్రంగా ఉన్నా పట్టించుకోరని ఇది మంచి పద్ధతి కాదని అన్నారు. నెలలో 29 రోజులు మీ కోసం మీరు కష్టపడితే ఒక్కరోజు సమాజం కోసం కష్టపడాలని ఆయన ప్రజలను కోరారు. గాంధీ జయంతి సందర్భంగా ఆయన గుంటూరులో బాపూజీకి శ్రద్ధాంజలి ఘటించిన అనంతరం జరిగిన బహిరంగ […]

స్వచ్ఛాంధ్రప్రదేశ్‌ లక్ష్యంగా సాగుదాం: చంద్రబాబు పిలుపు
X

స్వచ్ఛ భారత్‌లో ఆంధ్రప్రదేశ్‌ను అగ్రస్థానంలో ఉంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి ఎన్‌. చంద్రబాబునాయుడు పిలుపు ఇచ్చారు. ఇతర దేశాల్లో పరిశుభ్రతకు అగ్ర పీఠం వేస్తారని, కాని భారతదేశంలో తమ పక్కనే అపరిశుభ్రంగా ఉన్నా పట్టించుకోరని ఇది మంచి పద్ధతి కాదని అన్నారు. నెలలో 29 రోజులు మీ కోసం మీరు కష్టపడితే ఒక్కరోజు సమాజం కోసం కష్టపడాలని ఆయన ప్రజలను కోరారు. గాంధీ జయంతి సందర్భంగా ఆయన గుంటూరులో బాపూజీకి శ్రద్ధాంజలి ఘటించిన అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్టాడుతూ స్వచ్ఛాంధ్రప్రదేశ్‌కు ప్రతి ఒక్కరూ ప్రతిన పూనాలని పిలుపు ఇచ్చారు. భారతదేశాన్ని స్వచ్ఛంగా ఉంచడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలో సూచనలు ఇవ్వాల్సిందిగా కోరుతూ కేంద్ర ప్రభుత్వం ఆరుగురు ముఖ్యమంత్రులతో ఓ కమిటీ వేసిందని, ఆ కమిటీకి తానే సారథ్యం వహిస్తున్నానని చెబుతూ దీనికి సంబంధించిన నివేదికను వారం రోజుల్లో అందజేస్తామని తెలిపారు. ఆ కమిటీకి తానే సారధ్యం వహిస్తున్నందున ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న తనకు స్వచ్ఛాంధ్రప్రదేశ్‌గా రూపొందించడంలో మరింత ఎక్కువ బాధ్యత ఉందని చంద్రబాబు అన్నారు. మరుగుదొడ్డి లేని ఇల్లు ఉండకూడదని ప్రభుత్వ లక్ష్యానికి ప్రతి ఇంటివారు సహకరించాలని ఆయన కోరారు.
దేశంలోనే అద్బుతమైన రాజధానిని నిర్మించాలని సంకల్పించామని, దీనికి రైతులు 33 వేల ఎకరాల భూమిని ఇచ్చారని, అమరావతిగా రాజధాని నిర్మాణానికి ఈ నెల 22న ప్రధానమంత్రి నరేంద్రమోడి శంకుస్థాపన చేస్తారని, ఈ కార్యక్రమానికి సింగపూర్‌, మలేషియా ప్రధానమంత్రులు కూడా హాజరవుతారని తెలిపారు. ప్రపంచపటంలో ఆంధ్రప్రదేశ్‌కు గుర్తింపు తెచ్చిన ఘనత తనదేనని, మళ్ళీ విభజిత ఆంధ్రప్రదేశ్‌ను కూడా ప్రపంచం గుర్తించేట్టు చేయడం తన లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. తమ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుండాలనే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తోందని, వ్యాపారాలకు అనుకూలమైన రాష్ట్రంగా గుజరాత్‌ తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు స్థానం దక్కిందని, దీన్ని ఆగ్రగామిగా నిలపాలని తాను భావిస్తున్నానని ఆయన తెలిపారు. భారతదేశ అభివృద్ధి రేటు 7.2 శాతం ఉంటే ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి రేటు 9.3 శాతం ఉందని, దీన్ని రెండంకెల స్థాయికి తీసుకెళితే రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు వస్తాయని తెలిపారు. ఎంతోమంది నాయకులు కలలుగన్న నదుల అనుసంధానాన్ని గోదావరి, కృష్ణా నదులను కలిపి రుజువు చేశామని, చరిత్రలో ఇదొక మైలురాయిగా మిగిలేట్టు చేశామని అన్నారు. అంతకుముందు ఆయన చీపురు పట్టుకుని రహదారులను ఊడ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నారాయణ, కామినేని తదితరులు పాల్గొన్నారు.

First Published:  2 Oct 2015 3:37 AM GMT
Next Story