Telugu Global
Others

మధ్యాహ్న భోజనం పెట్టకపోతే విద్యార్థులకు అలవెన్సు

మధ్యాహ్న భోజన పథకం అమలవుతున్న స్కూళ్లలో ఏదైనా కారణం వల్ల విద్యార్థులకు వరుసగా మూడు రోజులుగానీ, ఒక నెలలో ఐదు రోజులుగానీ భోజనం పెట్టకపోతే… అందు కు తగినట్లుగా విద్యార్థులకు భత్యం చెల్లించాలని కేంద్రం ఆదేశించింది. ఈ మొత్తాన్ని తర్వాతి నెలలో తొలి 15 రోజుల్లోనే చెల్లించాల్సి ఉంటుంది. పాఠశాల విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం నాణ్యతపై కూడా కేంద్రం దృష్టి సారించింది. ప్రతినెలా గుర్తింపు పొందిన ప్రయోగశాలల్లో ఆహార పరీక్షలు జరపాలని ఆదేశించింది. నాసిరకం భోజనంపై […]

మధ్యాహ్న భోజన పథకం అమలవుతున్న స్కూళ్లలో ఏదైనా కారణం వల్ల విద్యార్థులకు వరుసగా మూడు రోజులుగానీ, ఒక నెలలో ఐదు రోజులుగానీ భోజనం పెట్టకపోతే… అందు కు తగినట్లుగా విద్యార్థులకు భత్యం చెల్లించాలని కేంద్రం ఆదేశించింది. ఈ మొత్తాన్ని తర్వాతి నెలలో తొలి 15 రోజుల్లోనే చెల్లించాల్సి ఉంటుంది. పాఠశాల విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం నాణ్యతపై కూడా కేంద్రం దృష్టి సారించింది. ప్రతినెలా గుర్తింపు పొందిన ప్రయోగశాలల్లో ఆహార పరీక్షలు జరపాలని ఆదేశించింది. నాసిరకం భోజనంపై అందుతున్న ఫిర్యాదుల్ని దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ పరీక్షల్లో నాణ్యత, పోషకాలున్న భోజనాన్ని అందిస్తున్నారని ప్రభుత్వ గుర్తింపు పొందిన ఆహార పరిశోధన ప్రయోగశాల ధ్రువీకరించాల్సి ఉంటుంది. నెలకొసారి ఈ పరీక్షలు జరపాల్సి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు నూతన నిబంధనలను ఆమోదిస్తూ నోటిఫికేషన్‌ జారీ చే సింది. ఆహార భద్రత చట్టం కింద ప్రభు త్వం ఈ మార్పులు చేసినట్లు మానవ వనరుల మంత్రిత్వ శాఖ అధికారులు పేర్కొన్నారు.

First Published:  1 Oct 2015 1:08 PM GMT
Next Story