Telugu Global
Others

ఇక ప్రతి ఆదివారం ఉద్యోగ పరీక్షలు: ఘంటా

ఉద్యోగాలు వస్తాయని ఆశతో ఎదురుచూస్తున్న యువతకు అవకాశాలు కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నామని టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి అన్నారు. వచ్చే డిసెంబర్ వరకు ప్రతి ఆదివారం ఉద్యోగార్హత పరీక్షలు నిర్వహించడానికి షెడ్యూల్ ఖరారు చేశామన్నారు. ఈ నెల 25న ఒక పరీక్ష, నవంబర్ ఒకటిన మరో పరీక్ష నిర్వహించడానికి చర్యలు తీసుకున్నామన్నారు. ఉద్యోగ పరీక్షలు నిర్వహణలో ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలు తమ కాలేజీలలో ఉన్న సదుపాయాలు, వసతులు వంటి వివరాలను యాజమాన్యాలు సర్వీస్ కమిషన్‌కు పంపించాలని ఘంటా […]

ఉద్యోగాలు వస్తాయని ఆశతో ఎదురుచూస్తున్న యువతకు అవకాశాలు కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నామని టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి అన్నారు. వచ్చే డిసెంబర్ వరకు ప్రతి ఆదివారం ఉద్యోగార్హత పరీక్షలు నిర్వహించడానికి షెడ్యూల్ ఖరారు చేశామన్నారు. ఈ నెల 25న ఒక పరీక్ష, నవంబర్ ఒకటిన మరో పరీక్ష నిర్వహించడానికి చర్యలు తీసుకున్నామన్నారు. ఉద్యోగ పరీక్షలు నిర్వహణలో ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలు తమ కాలేజీలలో ఉన్న సదుపాయాలు, వసతులు వంటి వివరాలను యాజమాన్యాలు సర్వీస్ కమిషన్‌కు పంపించాలని ఘంటా కోరారు. ఆయా ఉద్యోగాలకు పోటీపడేవారు 30 వేలు దాటితే ఆన్‌లైన్లో.. అంతకన్నా ఎక్కువ దరఖాస్తులు వచ్చిన ఉద్యోగాల పరీక్షలను ఆఫ్‌ లైన్లో నిర్వహించాలని సర్వీస్ కమిషన్ నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు.

First Published:  1 Oct 2015 1:09 PM GMT
Next Story