హైదరాబాద్‌లో 10 వేల సీసీ కెమెరాలు

వచ్చే ఏడాది గణేష్ నిమజ్జనం నాటికి పది వేల సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శ రాజీవ్‌శర్మ ఆదేశించారు. ఐదేళ్లలో లక్ష సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు లక్ష్యంగా పని చేయాలని సూచించారు. సీసీ టీవీ కెమెరాల ఏర్పాటుపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. సచివాలయంలో పోలీసు ఉన్నతాధికారులతో కూడా ఆయన సీసీ కెమెరాల ఏర్పాటుపై చర్చించారు.