Telugu Global
Others

డిసెంబర్‌లోగా 30 వేల ఉద్యోగాల భర్తీ: విఠల్‌

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ద్వారా ఈ ఏడాది అంతానికి 30 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు కమిషన్ సభ్యుడు సీ విఠల్ తెలిపారు. మొదటి విడతగా 15 వేల ఉద్యోగాల భర్తీకి ఆర్థికశాఖ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందని, మరో 10 వేల ఉద్యోగాల భర్తీకి త్వరలోనే ఆమోదం తెలుపనుందని అన్నారు. తెలంగాణ వికాస సమితి, రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్‌లు శుక్రవారం కొత్తపేటలోని బాబూ జగ్జీవన్‌రాం భవన్‌లో సయుక్తంగా నిర్వహించిన పోటీ పరీక్షల అవగాహన సదస్సును […]

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ద్వారా ఈ ఏడాది అంతానికి 30 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు కమిషన్ సభ్యుడు సీ విఠల్ తెలిపారు. మొదటి విడతగా 15 వేల ఉద్యోగాల భర్తీకి ఆర్థికశాఖ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందని, మరో 10 వేల ఉద్యోగాల భర్తీకి త్వరలోనే ఆమోదం తెలుపనుందని అన్నారు. తెలంగాణ వికాస సమితి, రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్‌లు శుక్రవారం కొత్తపేటలోని బాబూ జగ్జీవన్‌రాం భవన్‌లో సయుక్తంగా నిర్వహించిన పోటీ పరీక్షల అవగాహన సదస్సును ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ సందర్భంగా విఠల్ మాట్లాడుతూ కేవలం రూ.100 వెచ్చించి ప్రభుత్వ ఉద్యోగం పొందే పరిస్థితులు రావాలన్నదే తమ సంకల్పమని తెలిపారు.

First Published:  2 Oct 2015 1:12 PM GMT
Next Story