Telugu Global
NEWS

రాజధానిలో 9 థీమ్ సిటీలు: చంద్రబాబు

నవ్యాంధ్ర రాజధానిలో తొమ్మిది థీమ్‌ సిటీల నిర్మాణం జరుగుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. సీఆర్డీఏ అధికారులతో సమావేశం ముగిసిన తర్వాత ఆయన మాట్లాడుతూ కృష్ణా నది పరివాహకం, కొండవీటి వాగు రిజర్వాయర్‌ వాటర్‌ ఫ్రంట్‌ల మధ్య బ్లూగ్రీన్‌ సిటీగా అమరావతిని తీర్చి దిద్దాలని చంద్రబాబు అధికారులకు సూచించారు. యాభై ఎకరాల విస్తీర్ణంలో ప్రధానమంత్రి నరేంద్రమోడి చేతుల మీదుగా ఈ నెల 22న రాజధాని శంకుస్థాపన కార్యక్రమం ఉంటుందని ఆయన తెలిపారు. రెండు ఐకాన్‌ టవర్లు, వాటర్‌ […]

రాజధానిలో 9 థీమ్ సిటీలు: చంద్రబాబు
X

నవ్యాంధ్ర రాజధానిలో తొమ్మిది థీమ్‌ సిటీల నిర్మాణం జరుగుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. సీఆర్డీఏ అధికారులతో సమావేశం ముగిసిన తర్వాత ఆయన మాట్లాడుతూ కృష్ణా నది పరివాహకం, కొండవీటి వాగు రిజర్వాయర్‌ వాటర్‌ ఫ్రంట్‌ల మధ్య బ్లూగ్రీన్‌ సిటీగా అమరావతిని తీర్చి దిద్దాలని చంద్రబాబు అధికారులకు సూచించారు. యాభై ఎకరాల విస్తీర్ణంలో ప్రధానమంత్రి నరేంద్రమోడి చేతుల మీదుగా ఈ నెల 22న రాజధాని శంకుస్థాపన కార్యక్రమం ఉంటుందని ఆయన తెలిపారు. రెండు ఐకాన్‌ టవర్లు, వాటర్‌ ఫ్రంట్‌, సువిశాల రహదార్ల మధ్య చారిత్రక పర్యాటక కేంద్రంగా రాజధాని నిలవాలని ఆయన ఆకాంక్షించారు. రాజధానిలో మూడు రీజియన్‌ కేంద్రాల మధ్య తొమ్మిది థీమ్‌ సిటీల నిర్మాణముంటుందని ముఖ్యమంత్రి తెలిపారు. నిర్మాణం పకడ్బందీగా, పర్యావరణ హితంగా జరుగుతుందని ఆయన చెప్పారు. సవాళ్ళు లేకపోతే అభివృద్ధి సాధ్యం కాదని, ఎక్కడ సవాళ్ళు ఉంటాయో అక్కడే అవకాశాలు కూడా ఉద్బవిస్తాయని సీఎం చంద్రబాబు తెలిపారు.

First Published:  3 Oct 2015 9:01 AM GMT
Next Story