గుజరాత్‌లో రిజర్వేషన్లకు బ్రాహ్మణుల ఉద్యమం

తమ సామాజిక వర్గంలో ఆర్థికంగా వెనుకబడి ఉన్న 55 లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వం విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని గుజరాత్‌ బ్రాహ్మణ్‌ సమాజ్‌ అధ్యక్షుడు శైలేష్‌ జోషి డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని దేవాలయాల్లో పూజారులుగా పనిచేస్తోన్న బ్రాహ్మణులకు ప్రతీ నెలా జీతాలు చెల్లించాలని కోరారు. ఈ విషయంలో రాష్ట్ర సర్కారు తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ప్రస్తుత రిజర్వేషన్ల విధానానికి తాము వ్యతిరేకమని, కులంతో సంబంధం లేకుండా ఆర్థిక వెనుకబాటు ప్రాతిపదికగా రిజర్వేషన్లు కల్పించాలని, ఆర్థికంగా వెనుకబడి ఉన్న 55 లక్షల మంది బ్రాహ్మణుల కోసం బ్రాహ్మణ వికాస్ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.