Telugu Global
Cinema & Entertainment

రకుల్ కి 'చిరు' కితాబు...

బ్రూస్‌లీ సినిమాలో నటించేందుకు రామ్‌చరణ్ ఎంతో శ్రమించారని నటుడు చిరంజీవి కితాబిచ్చారు. శుక్రవారం బ్రూస్‌లీ సినిమా ఆడియో విడుదల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బ్రూస్‌లీలో తన పాత్ర గురించి అభిమానులు ఎంతో ఉత్సుకతతో ఉన్నారని అన్నారు. బ్రూస్‌లీ సినిమాలో తన ఎంట్రీ కొస మెరుపు లాంటిదని చిరంజీవి అన్నారు. ఈ సినిమాలో తన పాత్ర గురించి చెప్పాలంటే సంపూర్ణంగా భోజనం చేసిన తర్వాత ఒక స్వీటు తిన్నట్టు ఉంటుందన్నారు. తమకు ఇన్‌స్పిరేషన్ అభిమానులేనని చెప్పారు. సినిమా ఎలాగు […]

రకుల్ కి చిరు కితాబు...
X
బ్రూస్‌లీ సినిమాలో నటించేందుకు రామ్‌చరణ్ ఎంతో శ్రమించారని నటుడు చిరంజీవి కితాబిచ్చారు. శుక్రవారం బ్రూస్‌లీ సినిమా ఆడియో విడుదల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బ్రూస్‌లీలో తన పాత్ర గురించి అభిమానులు ఎంతో ఉత్సుకతతో ఉన్నారని అన్నారు. బ్రూస్‌లీ సినిమాలో తన ఎంట్రీ కొస మెరుపు లాంటిదని చిరంజీవి అన్నారు. ఈ సినిమాలో తన పాత్ర గురించి చెప్పాలంటే సంపూర్ణంగా భోజనం చేసిన తర్వాత ఒక స్వీటు తిన్నట్టు ఉంటుందన్నారు. తమకు ఇన్‌స్పిరేషన్ అభిమానులేనని చెప్పారు. సినిమా ఎలాగు రిలీజ్‌కు దగ్గరకు వచ్చింది కాబట్టి సినిమాలోని డైలాగ్ చెప్పడానికి వెనుకాడనని ఒక డైలాగ్ చెప్పారు.
బ్రూస్‌లీలో రామ్‌చరణ్ కొట్టిన బాస్ మీ స్టెమినోను, మీ స్పీచ్‌ను అందుకోలేను బాస్ అనే డైలాగ్‌ను చెప్పారు. సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ తన అందచందాలతో అలరించారని కితాబిచ్చారు. సినిమాకు ఒక రూపు వచ్చేలా నటించారని అన్నారు. రకుల్‌కు ప్రత్యేక అభినందలను తెలిపారు. ఈ నెల 16న ప్ర‌పంచ వ్యాప్తంగా బ్రుస్ లీ చిత్రం రిలీజ్ కు సిద్దం అవుతుంది. శీను వైట్ల డైరెక్ష‌న్ . త‌మ‌న్నా స్పెస‌ల్ సాంగ్. అంచ‌నాలు భారీగా వున్నాయి మ‌రి.!
First Published:  2 Oct 2015 7:09 PM GMT
Next Story