ర్యాంపుపై మరగుజ్జుల వాక్‌!

ఇప్పటివరకు ర్యాంపుపై నటీనటులను, అందాలు చిందించే ఫ్యాషన్ మోడళ్ల వాక్‌నే ఇప్పటి వరకు చూశాం. కానీ మరుగుజ్జు మోడళ్లు కూడా ర్యాంపుపై  వాక్‌ చేస్తుంటే భలే గమ్మత్తుగా ఉంటుంది కదూ. మరుగుజ్జు మోడళ్లను చూడాలంటే పారిస్ వెళ్లాల్సిందే. సరికొత్తగా పారిస్‌లో మరుగుజ్జు ఫ్యాషన్ షో జరిగింది. మరుగుజ్జులు ర్యాంపుపై క్యాట్ వాక్ చేసి అందరిని ఆకట్టుకున్నారు. ఇలాంటి షోలు ప్రజలతో పాటు మరుగుజ్జులకు కూడా జీవితంపై కొత్త ఆశలు చిగురింపజేస్తాయని, తమకు కూడా మంచి గుర్తింపు లభించగలదని భావిస్తారని ఫ్రెంచ్‌ మోడల్‌ ఎమ్మా అన్నారు. తాను కూడా క్యాట్ వాక్ చేయగలనని, చేయాలన్న ఆలోచన వారిలోనూ కలుగుతుందని ఫ్రెంచ్ మోడల్ ఎమ్మా పేర్కొన్నారు.