అసదుద్దీన్‌ ఓవైసీ మీకు కావలసినవాడా: కేజ్రీవాల్‌

ఉత్తరప్రదేశ్‌లోని దాద్రి వెళుతుంటే ఎంఐఎం నేత, ఎంపీ ఓవైసీని ఆపని పోలీసులు తననెందుకు ఆపారని ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రివాల్‌ ప్రశ్నించారు. దీని వెనుక ఉన్న కథేంటో చెప్పాలని ఆయన బీజేపీ నేతలను ప్రశ్నించారు. ఆవు మాంసం తిన్నారనే కారణంతో మహ్మద్‌ ఇక్బాల్‌ అనే వ్యక్తిని రాళ్ళతో కొట్టి చంపిన నేపథ్యంలో ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి వెళుతున్న కేజ్రివాల్‌ను పోలీసులు మధ్యలోనే ఆపేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన ఖాకీలను నిలదీశారు. ఆ తర్వాత కేజ్రీని దాద్రి వెళ్ళేందుకు, బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు పోలీసులు అనుమతించారు.