Telugu Global
National

ఆధార్ ఉండాల్సిందే!

సుప్రీంకోర్టు అభ్యంతరం చెప్పినా ప్రభుత్వాల తీరు మారడం లేదు. యూపీఏ మొదలు పెట్టిన ఆధార్ ప్రక్రియను సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం పక్కన పెడుతుందని భావించారు. అయితే అవేమీ పట్టించుకోని కేంద్రం ఆధార్ ను కొనసాగించడంతోపాటు వీలైనంత త్వరగా కార్డుల జారీని పూర్తి చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా 92కోట్ల మందికి ఆధార్ కార్డుల జారీ పూర్తయింది. త్వరలోనే మిగతా పని పూర్తిచేసి.. అన్ని సంక్షేమ పథకాలను ఆధార్ ను లింకు […]

ఆధార్ ఉండాల్సిందే!
X

సుప్రీంకోర్టు అభ్యంతరం చెప్పినా ప్రభుత్వాల తీరు మారడం లేదు. యూపీఏ మొదలు పెట్టిన ఆధార్ ప్రక్రియను సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం పక్కన పెడుతుందని భావించారు. అయితే అవేమీ పట్టించుకోని కేంద్రం ఆధార్ ను కొనసాగించడంతోపాటు వీలైనంత త్వరగా కార్డుల జారీని పూర్తి చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా 92కోట్ల మందికి ఆధార్ కార్డుల జారీ పూర్తయింది. త్వరలోనే మిగతా పని పూర్తిచేసి.. అన్ని సంక్షేమ పథకాలను ఆధార్ ను లింకు చేయాలని కేంద్రం భావిస్తోంది.
ఇప్పటికే ఎల్పీజీ, పెన్షన్లు, బ్యాంకు ఖాతాలకు ఆధార్ కార్డును అనుసంధానం చేస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆధార్ అనుసంధానం చేయడం ద్వారా సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకు అందుతాయని.. తద్వారా వేల కోట్ల రూపాయల నిధులు పక్కదారి పట్టకుండా ఉంటాయని కేంద్రంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి.
అయితే గ్యాస్‌కు అనుసంధానం చేయడంపై కోర్టులో పలు కేసులు నమోదయ్యాయి. విచారిస్తున్న ధర్మాసనం దీనిపై సందేహాలు వ్యక్తం చేసింది. దేశంలో అందరికీ ఆధార్ కార్డులు జారీ కాలేదు కాబట్టి సంక్షేమ పథకాలకు ఆధార్‌ అనుసంధానం సరికాదని వ్యాఖ్యానించింది.
ఆధార్ పై సుప్రీంకోర్టులో వివాదాలు కొనసాగుతుండగానే కేంద్రం కార్డుల జారీ ప్రక్రియకు మరోసారి శ్రీకారం చుట్టింది. అయితే కొత్త కార్డులు ఇవ్వడానికి కోర్టు నుంచి ఎలాంటి అభ్యంతరాలు ఉండకపోవచ్చని కేంద్రం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే కొత్త కార్డుల జారీ ప్రక్రియను మరింత వేగవంతం చేయబోతోంది.

First Published:  3 Oct 2015 1:27 AM GMT
Next Story