Telugu Global
Others

సింగపూర్‌పై "గార్డియన్" సంచలన కథనం. ఆ సీఎం ఎవరు?

సింగపూర్‌లో పెట్టుబడుల ప్రవాహంపై ప్రముఖ పత్రిక ”సండే గార్డియన్” సంచలన కథనాన్ని ప్రచురించింది. దేశంలోని నల్లకుబేరులంతా తమ అక్రమ సొమ్మును సింగపూర్‌లో పోగేస్తున్నారని పత్రిక తేల్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఒకరు సింగపూర్‌లో హోటల్ కొనుగోలు చేసిన విధానాన్ని కూడా గార్డియన్ పత్రిక పూసగుచ్చినట్టు వివరించింది. దీంతో ఆ సీఎం ఎవరన్న దానిపై చర్చ మొదలైంది. గతంలో తెహల్కా చెప్పిన విషయాలు, ఇప్పుడు సండే గార్డియన్ కథనాలను విశ్లేషించుకుంటున్న నేతలు… సింగపూర్‌లో హోటల్ కొన్నది ఎవరనే దానిపై ఒక అవగాహనకు […]

సింగపూర్‌పై గార్డియన్ సంచలన కథనం. ఆ సీఎం ఎవరు?
X

సింగపూర్‌లో పెట్టుబడుల ప్రవాహంపై ప్రముఖ పత్రిక ”సండే గార్డియన్” సంచలన కథనాన్ని ప్రచురించింది. దేశంలోని నల్లకుబేరులంతా తమ అక్రమ సొమ్మును సింగపూర్‌లో పోగేస్తున్నారని పత్రిక తేల్చింది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఒకరు సింగపూర్‌లో హోటల్ కొనుగోలు చేసిన విధానాన్ని కూడా గార్డియన్ పత్రిక పూసగుచ్చినట్టు వివరించింది. దీంతో ఆ సీఎం ఎవరన్న దానిపై చర్చ మొదలైంది. గతంలో తెహల్కా చెప్పిన విషయాలు, ఇప్పుడు సండే గార్డియన్ కథనాలను విశ్లేషించుకుంటున్న నేతలు… సింగపూర్‌లో హోటల్ కొన్నది ఎవరనే దానిపై ఒక అవగాహనకు వస్తున్నట్టు తెలుస్తుంది..

ఏపీ రాజధాని నిర్మాణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సింగపూర్ వెంటపడుతున్న నేపథ్యంలో సండే గార్డియన్ పత్రిక కథనం కలకలం రేపుతోంది. నల్లధనానికి బ్యాంకులా మారిన సింగపూర్‌ భాగస్వామ్యం కోసం కొన్ని ప్రభుత్వాలు ఎందుకు పాకులాడుతున్నాయో అనుమానాలు కలిగే అవకాశం ఉంది.

దేశంలోని కోట్లాది రూపాయల నల్లధనాన్ని సింగపూర్ తరలించి తిరిగి పెట్టుబడుల రూపంలో దేశంలోకి మన నేతలే తీసుకొస్తున్నారని వివరించింది. బెంగాల్‌ను కుదిపేసిన శారద కుంభకోణం సొమ్ముంతా సింగపూర్‌కే తరలిపోయిందని కూడా చెబుతోంది. గతంలో అక్రమసొమ్ము దాచుకోవడానికి స్విట్జర్లాండ్, మారిషన్ వంటి దేశాలకు భారత నల్లకుబేరులు ప్రాధాన్యత ఇచ్చేవారు. అయితే ఇటీవల అంతర్జాతీయ ఒత్తిడికి లొంగి ఆ దేశాలు బ్లాక్ మనీ వివరాలను బయటపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌లోని నల్లకుబేరులంతా సింగపూర్ వెంట పడుతున్నారని సండే గార్డియన్ విశ్లేషిస్తోంది.

First Published:  2 Oct 2015 9:43 PM GMT
Next Story