Telugu Global
Others

వేలి అంచున కూర‌గాయ‌ల మార్కెట్‌ !

హైద‌రాబాద్‌లో జ‌నాభాకు స‌రిప‌డా కూర‌గాయ‌ల మార్కెట్లు లేవు. రైతు బ‌జార్ల‌కు వెళ్లాలంటే.. ప్ర‌తి కాల‌నీ వాసులు రెండు, మూడు కిలోమీట‌ర్లు ప్ర‌యాణించాల్సిందే! న‌గ‌రంలో ఇక ఈ చిక్కుల‌కు పుల్‌స్టాప్ పెట్ట‌నుంది గుడ్‌బాక్స్ యాప్! ఇందులో కావాల్సిన కూర‌గాయ‌ల‌ను టైప్ చేస్తే చాలు నిమిషాల్లో ఆర్డ‌ర్ చేసిన కూర‌గాయ‌లు మీ ఇంటి ముందు ప్ర‌త్య‌క్ష‌మ‌వుతాయి. ఉరుకుల ప‌రుగుల న‌గ‌ర జీవితంలో కూర‌గాయ‌లు తెచ్చుకోలేనంత బిజీగా కొన్ని వేల‌మంది ఉద్యోగులు ఉన్నారు. వారంద‌రికీ ఎంతగానో ఉప‌యోగ‌ప‌డే యాప్ ఇది. ఇది […]

హైద‌రాబాద్‌లో జ‌నాభాకు స‌రిప‌డా కూర‌గాయ‌ల మార్కెట్లు లేవు. రైతు బ‌జార్ల‌కు వెళ్లాలంటే.. ప్ర‌తి కాల‌నీ వాసులు రెండు, మూడు కిలోమీట‌ర్లు ప్ర‌యాణించాల్సిందే! న‌గ‌రంలో ఇక ఈ చిక్కుల‌కు పుల్‌స్టాప్ పెట్ట‌నుంది గుడ్‌బాక్స్ యాప్! ఇందులో కావాల్సిన కూర‌గాయ‌ల‌ను టైప్ చేస్తే చాలు నిమిషాల్లో ఆర్డ‌ర్ చేసిన కూర‌గాయ‌లు మీ ఇంటి ముందు ప్ర‌త్య‌క్ష‌మ‌వుతాయి. ఉరుకుల ప‌రుగుల న‌గ‌ర జీవితంలో కూర‌గాయ‌లు తెచ్చుకోలేనంత బిజీగా కొన్ని వేల‌మంది ఉద్యోగులు ఉన్నారు. వారంద‌రికీ ఎంతగానో ఉప‌యోగ‌ప‌డే యాప్ ఇది. ఇది కూడా వాట్సాప్ యాప్‌లాంటిదే!

ప్ర‌స్తుతం న‌గ‌రంలో దిన‌ప‌త్రిక‌లు, పాల ప్యాకెట్ల లాగానే వీరు కూడా కూర‌గాయ‌ల‌ను నేరుగా ఇంటికే వ‌చ్చి హోం డెలివ‌రీ చేస్తారు. వినియోగ‌దారుల ఫోన్ నెంబ‌ర్లు ఇత‌రుల‌కు క‌న‌పించ‌వు. కాబ‌ట్టి వ్యాపారితో నేరుగా చాట్ చేయ‌వ‌చ్చు. కావాల్సిన వ‌స్తువుల‌ను వినియోగ‌దారుడికి చూపించేందుకు ఫొటో షేరింగ్ కూడా ఉంది. దీంతో మ‌న‌కు కావాల్సిన కూర‌గాయ‌ల ఎంపిక మ‌రింత సుల‌భ‌మ‌వుతుంది. స్మార్ట్ ఫోన్ల వినియోగం విప‌రీతంగా పెరుగుతున్న ఈ కాలంలో ఈ యాప్ డౌన్‌ లోడ్ చేసుకోవ‌డం పెద్ద విష‌య‌మేం కాదు. మ‌రి ఎందుకు ఆల‌స్యం! play.google.com నుంచి ఈ మొబైల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

First Published:  2 Oct 2015 1:06 PM GMT
Next Story