వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టు ప్రతిష్టాత్మకం: కేటీఆర్

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్‌గ్రిడ్ బృహత్తర పథకం ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రజలు కోరకముందే సీఎం కేసీఆర్ వాటర్‌గ్రిడ్ పథకం తీసుకొచ్చారని గుర్తు చేశారు. తాగునీరు ఇవ్వకుంటే ఓట్లు అడగమని సీఎం చెప్పారు. త్వరలో ఏ గ్రామానికి ఎప్పుడు నీళ్లు ఇస్తామో బుక్‌లెట్లు విడుదల చేస్తామని ప్రకటించారు. సీఎం కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శమని తెలిపారు.