Telugu Global
International

కడలిలో కలిసిపోనున్న ఆ గ్రామం...

అమెరికాలోని కివలిన గ్రామం కథ కడలికి చేరనుంది. అర్కిటిక్ సముద్రం ఒడ్డున ప్రకృతి శోభతో అలరారుతున్న అలాస్కాలోని ఈ గ్రామం మరో 15 యేళ్ళలో సముద్ర గర్భంలో కలిసి పోతుందని నిపుణులు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒకప్పుడు ఈ గ్రామం సముద్రానికి 400 అడుగుల ఎత్తులో ఉండేది. కానీ ఇప్పుడు కేవలం పది అడుగులకు చేరిపోయింది. ఈ మధ్యనే.. గ్రామాన్ని అమెరికా సైనిక దళాల బృందం సందర్శించింది. ఆ బృందంలోని ఇంజినీర్లు ఈ గ్రామం మునక ముప్పు గురించి […]

కడలిలో కలిసిపోనున్న ఆ గ్రామం...
X
అమెరికాలోని కివలిన గ్రామం కథ కడలికి చేరనుంది. అర్కిటిక్ సముద్రం ఒడ్డున ప్రకృతి శోభతో అలరారుతున్న అలాస్కాలోని ఈ గ్రామం మరో 15 యేళ్ళలో సముద్ర గర్భంలో కలిసి పోతుందని నిపుణులు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒకప్పుడు ఈ గ్రామం సముద్రానికి 400 అడుగుల ఎత్తులో ఉండేది. కానీ ఇప్పుడు కేవలం పది అడుగులకు చేరిపోయింది. ఈ మధ్యనే.. గ్రామాన్ని అమెరికా సైనిక దళాల బృందం సందర్శించింది. ఆ బృందంలోని ఇంజినీర్లు ఈ గ్రామం మునక ముప్పు గురించి నిర్థారించారు. ఆర్కిటిక్ వలయానికి 83 మైళ్ల దూరంలోగల దీవిలోని ఈ గ్రామంలో… 430 మంది నివసిస్తున్నారు. తరతరాల నుంచి వారు సముద్రాన్నే నమ్ముకుని జీవనం సాగిస్తున్న ఈ గ్రామ ప్రజలు పళ్ళ తోటలు, తిమింగలాల వేటపై ఆధారపడి జీవించేవారు. అయితే ఇప్పుడు మునిగి పోవడానికి సిద్ధంగా ఉన్న గ్రామం గురించి తెలుసుకుని ఆవేదన చెందుతున్నారు. మరి కొందరు అలాస్కా… ఇతర నగరాలకు వలస వెళ్లడానికి సిద్ధపడుతున్నారు. కాగా ఈ ద్వీప గ్రామాన్ని 1847లో రష్యా నౌకా దళం కనుగొనగా.. తర్వాతి కాలంలో అది పూర్తిగా అమెరికా మనుగడలోకి వెళ్ళింది. అర్కిటిక్ ప్రాంతంలో మంచు పర్వతాలు కరగడంతో తుఫానులు చెలరేగి ఈ గ్రామం దెబ్బతింది. మరో పక్క భూతాపం పెరుగుతున్న కొద్దీ మంచు పర్వతాలు కరిగి పోతుండటంతో జలాలు పెరిగి గ్రామం కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తోంది.
First Published:  4 Oct 2015 3:49 AM GMT
Next Story