Telugu Global
Cinema & Entertainment

 కాజల్ కోసం రామ్ చరణ్ ఆరాటం

కాజల్ పనైపోయిందనే వాళ్లే ఎక్కువ. ఆమెకు తెలుగులో ఇప్పుడు అవకాశాలు అంతంతమాత్రమే. కానీ రామ్ చరణ్ మాత్రం ఈ కలువకళ్ల పిల్లను మర్చిపోలేకపోతున్నాడు. కుదిరితే మరో అవకాశం ఇచ్చి వెన్నుతట్టాలనుకుంటున్నాడు. ఇప్పటికే మగధీర, గోవిందుడు అందరివాడేలే, ఎవడు లాంటి పలు సినిమాల్లో కాజల్-చెర్రీ కలిసి నటించారు. ఇప్పుడు ఆమెకు మరో అవకాశం ఇవ్వాలనుకుంటున్నాడు మెగాపవర్ స్టార్. బ్రూస్ లీ తర్వాత ఓ తమిళ రీమేక్ లో నటించడానికి ఒప్పుకున్నాడు రామ్ చరణ్. ఈ సినిమాలో హీరోయిన్ గా […]

 కాజల్ కోసం రామ్ చరణ్ ఆరాటం
X
కాజల్ పనైపోయిందనే వాళ్లే ఎక్కువ. ఆమెకు తెలుగులో ఇప్పుడు అవకాశాలు అంతంతమాత్రమే. కానీ రామ్ చరణ్ మాత్రం ఈ కలువకళ్ల పిల్లను మర్చిపోలేకపోతున్నాడు. కుదిరితే మరో అవకాశం ఇచ్చి వెన్నుతట్టాలనుకుంటున్నాడు. ఇప్పటికే మగధీర, గోవిందుడు అందరివాడేలే, ఎవడు లాంటి పలు సినిమాల్లో కాజల్-చెర్రీ కలిసి నటించారు. ఇప్పుడు ఆమెకు మరో అవకాశం ఇవ్వాలనుకుంటున్నాడు మెగాపవర్ స్టార్. బ్రూస్ లీ తర్వాత ఓ తమిళ రీమేక్ లో నటించడానికి ఒప్పుకున్నాడు రామ్ చరణ్. ఈ సినిమాలో హీరోయిన్ గా అమిరా డస్టర్ ను హీరోయిన్ గా తీసుకోవాలనుకున్నారు. గతంలో ధనుష్ హీరోగా నటించిన అనేకుడు సినిమాలో హీరోయిన్ గా నటించింది ఈ భామ. ఆల్ మోస్ట్ ఆల్ ఫైనల్ అయిపోయిందనుకున్న టైమ్ లో చరణ్ మెలికపెట్టాడు. తన కొత్త సినిమాలో కాజల్ ను తీసుకోవాల్సిందే అని పట్టుబట్టాడు. మరోవైపు కాజల్ ఏమో ఏకంగా 2కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తోందట. దీంతో ఏం చేయాలో పాలుపోక ప్రస్తుతం చర్చల్లో మునిగిపోయారు నిర్మాతలు.
First Published:  3 Oct 2015 7:05 PM GMT
Next Story