ప్లిప్‌కార్ట్‌ సీఎఫ్ఓగా శ్రీరామ్‌ వెంకటరామన్‌

శ్రీరామ్‌ యూనిలివర్‌ సంస్థలో దాదాపు ఇరవై యేళ్ళపాటు పని చేసిన శ్రీరామ్‌ వెంకటరామన్‌ను ప్లిప్‌కార్ట్‌ తన అక్కున చేర్చుకుంది. ఈ-కామర్స్‌ ప్లిప్‌కార్ట్‌ సీఎఫ్‌ఓగా (చీఫ్ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌) గా నియమితులయ్యారు. సంస్థకు సంబంధించిన అన్ని ఆర్తిక వ్యవహారాలను ఇక నుంచి శ్రీరామ్‌ పర్యవేక్షిస్తారని, ఆయన లక్ష్యాల సాధనకు ఎనలేని కృషి చేస్తారని సంస్థ నమ్ముతుందని ప్లిప్‌కార్ట్‌ ఓ ప్రకటనలో తెలిపింది. అదే విధంగా పన్నుల విభాగం అధిపతిగా ప్రమోద్‌ జైన్‌ను నియమించారు.