Telugu Global
Others

నోబెల్‌కు సింగపూర్ మాజీ రాజకీయ ఖైదీ

సింగపూర్‌కు చెందిన మాజీ రాజకీయ ఖైదీ చియా తై ఫో ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు. ఈ విషయాన్ని బ్యాంకాక్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జేమ్స్ గోమెజ్ ధ్రువీకరించారు. దేశ మాజీ ప్రధాని లీ కున్ యూ సారథ్యంలోని పీపుల్స్ యాక్షన్ పార్టీ (పీఏపీ) ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం నడిపించిన చియా సుదీర్ఘకాలం నిర్బంధంలో ఉన్నారు. తనకు వ్యతిరేకంగా గళమెత్తిన వారందరినీ జైళ్లలో పెట్టించిన లీ కున్ యూ.. చియాను 1966లో జైలుకు పంపించారు. 1989లో […]

సింగపూర్‌కు చెందిన మాజీ రాజకీయ ఖైదీ చియా తై ఫో ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు. ఈ విషయాన్ని బ్యాంకాక్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జేమ్స్ గోమెజ్ ధ్రువీకరించారు. దేశ మాజీ ప్రధాని లీ కున్ యూ సారథ్యంలోని పీపుల్స్ యాక్షన్ పార్టీ (పీఏపీ) ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం నడిపించిన చియా సుదీర్ఘకాలం నిర్బంధంలో ఉన్నారు. తనకు వ్యతిరేకంగా గళమెత్తిన వారందరినీ జైళ్లలో పెట్టించిన లీ కున్ యూ.. చియాను 1966లో జైలుకు పంపించారు. 1989లో విడుదల చేశాక కూడా ప్రభుత్వం ఆయనను 1998 వరకు గృహనిర్బంధంలో ఉంచింది. మొత్తంగా ఎటువంటి విచారణ లేకుండానే, చియాను 32 ఏండ్లపాటు నిర్బంధానికి గురి చేసింది. కాగా లీ కున్ యూ 91 ఏండ్ల వయసులో గత మార్చిలో మృతిచెందిన నేపథ్యంలో చియాను నోబెల్ బహుమతికి నామినేట్ చేయడం గమనార్హం.

First Published:  3 Oct 2015 1:07 PM GMT
Next Story