Telugu Global
Others

'A' కేటగిరి ఆర్థిక శక్తిగా తెలంగాణ

ఇండియా క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ(ఇక్రా)… తెలంగాణ రాష్ట్రాన్ని మెరుగైన రేటింగ్ ఇచ్చింది. టీ రాష్ట్రాన్ని ”A” కేటగిరి ఆర్థిక శక్తిగా గుర్తించింది. జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి రుణాలు తీసుకునే సందర్భంంలో తిరిగే చెల్లించే సామర్థ్యాన్ని బట్టి ఇక్రా రేటింగ్ ఇస్తుంది. తెలంగాణలో పెట్టే పెట్టుబడులకు సార్థకత ఉందని ఇక్రా రిపోర్టు చెబుతోంది. దేశ తలసరి ఆదాయం 74వేల 380గా ఉంటే తెలంగాణలో అది 95వేలుగా ఉందని ఇక్రా అంటోంది. పన్నుల ద్వారా వచ్చే ఆదాయం తెలంగాణలో మెరుగ్గా […]

A కేటగిరి ఆర్థిక శక్తిగా తెలంగాణ
X

ఇండియా క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ(ఇక్రా)… తెలంగాణ రాష్ట్రాన్ని మెరుగైన రేటింగ్ ఇచ్చింది. టీ రాష్ట్రాన్ని ”A” కేటగిరి ఆర్థిక శక్తిగా గుర్తించింది. జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి రుణాలు తీసుకునే సందర్భంంలో తిరిగే చెల్లించే సామర్థ్యాన్ని బట్టి ఇక్రా రేటింగ్ ఇస్తుంది.

తెలంగాణలో పెట్టే పెట్టుబడులకు సార్థకత ఉందని ఇక్రా రిపోర్టు చెబుతోంది. దేశ తలసరి ఆదాయం 74వేల 380గా ఉంటే తెలంగాణలో అది 95వేలుగా ఉందని ఇక్రా అంటోంది. పన్నుల ద్వారా వచ్చే ఆదాయం తెలంగాణలో మెరుగ్గా ఉందని అభిప్రాయపడింది.

గతంలో ఆంధ్రప్రదేశ్‌కు ఇక్రా సంస్థ మైనస్ రేటింగ్ ఇచ్చింది. విభజన తర్వాత తెలంగాణ ప్లస్‌లోని వెళ్లిందని టీ ప్రభుత్వం చెబుతోంది. ఇక్రా రేటింగ్ వల్ల తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు మరింత ఉత్సాహంగా ముందుకొస్తారని అభిప్రాయపడింది. ఇక్రా మెరుగైన రేటింగ్ వల్ల తక్కువ వడ్డీకే తెలంగాణ ప్రభుత్వం రుణాలు పొందే అవకాశం ఉంటుంది.

First Published:  4 Oct 2015 10:53 AM GMT
Next Story