Telugu Global
Others

వడ్డీరేట్లను తగ్గించిన మరో ఆరు బ్యాంకులు

రిజర్వు బ్యాంకు ఇటీవల రెపోరేటును తగ్గించిన కారణంగా… మరో ఆరు బ్యాంకులు వడ్డీరేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. ప్రభుత్వరంగ సంస్థలైన సిండికేట్ బ్యాంక్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ), యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్‌లు వడ్డీరేట్లలో 0.35 శాతం వరకు కోతపెట్టాయి. బ్యాంకులు తీసుకున్న తాజా నిర్ణయంతో గృహ, వాహన రుణాలు మరింత తగ్గనున్నాయి. ఈ నెల 12 నుంచి అమలులోకి వచ్చేలా యూబీఐ బేస్‌రేటును 9.90 శాతం నుంచి 9.55 శాతానికి తగ్గించింది. దీంతోపాటు […]

రిజర్వు బ్యాంకు ఇటీవల రెపోరేటును తగ్గించిన కారణంగా… మరో ఆరు బ్యాంకులు వడ్డీరేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. ప్రభుత్వరంగ సంస్థలైన సిండికేట్ బ్యాంక్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ), యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్‌లు వడ్డీరేట్లలో 0.35 శాతం వరకు కోతపెట్టాయి. బ్యాంకులు తీసుకున్న తాజా నిర్ణయంతో గృహ, వాహన రుణాలు మరింత తగ్గనున్నాయి. ఈ నెల 12 నుంచి అమలులోకి వచ్చేలా యూబీఐ బేస్‌రేటును 9.90 శాతం నుంచి 9.55 శాతానికి తగ్గించింది. దీంతోపాటు ఎంపిక చేసిన టర్మ్ డిపాజిట్లపై వడ్డీరేటును పావు శాతం నుంచి అరశాతం వరకు తగ్గించింది. సిండికేట్ బ్యాంక్ వడ్డీరేటును 30 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో రుణరేటు 9.70 శాతానికి చేరుకోనున్నది. అలాగే యూనియన్ బ్యాంక్ బేస్‌రేటును 0.35 శాతం తగ్గించడంతో 9.65 శాతానికి చేరుకుంది.

First Published:  3 Oct 2015 1:13 PM GMT
Next Story