బోర్డర్‌లో కర్నాటక Vs ఏపీ

సువర్ణముఖి నదీ జలాల కోసం కర్నాటక, ఏపీ  రైతుల మధ్య వివాదం చెలరేగింది. నదిపై నిర్మించిన అడ్డుకట్టను తొలగించేందుకు కర్ణాటకకు చెందిన అధికారులు,  రైతులు ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది.  సరిహద్దుల్లో ఇరు రాష్ట్రాలు భారీగా పోలీసులను మోహరించాయి. 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. కర్ణాటక ప్రాంతం నుంచి అగళి మండలం మీదుగా సువర్ణముఖి నది ప్రవహిస్తోంది. అయితే సరిహద్దు ప్రాంతం అగళి సమీపంలో నదికి అడ్డంగా గతంలో అడ్డుకట్ట నిర్మించారు. అక్కడి నుంచి నీటిని అగళి చెరువుకు మళ్లించేలా కాలువను తవ్వారు. దీనిపై కర్నాటక రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తమకు దక్కాల్సిన నీటిని అక్రమంగా మళ్లిస్తున్నారంటూ నదిపై కట్టిన అడ్డుకట్టను కూల్చేందుకు శనివారం ప్రయత్నించారు. అక్కడి రైతులకు సపోర్టుగా   తుమకూరు జిల్లా ఉన్నతాధికారులు, పోలీసులు వచ్చారు.