Telugu Global
Cinema & Entertainment

నాని సరసన కేరళ కుట్టి

భలే భలే మగాడివోయ్ సినిమా సక్సెస్ తో ఫుల్ జోష్ మీదున్నాడు నాని. అదే ఊపులో ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. త్వరలోనే సెట్స్ పైకి రాబోతున్న ఈ సినిమాతో మరో కేరళ కుట్టి తెలుగు తెరపై మెరవబోతోంది. తమిళనాట పాపనాశం, జిల్లా లాంటి హిట్ సినిమాల్లో నటించిన నివేద థోమస్ అనే భామను నాని కొత్త సినిమా కోసం సంప్రదించారు. కథ నచ్చడంతో నివేద ఇందులో నటించేందుకు […]

నాని సరసన కేరళ కుట్టి
X
భలే భలే మగాడివోయ్ సినిమా సక్సెస్ తో ఫుల్ జోష్ మీదున్నాడు నాని. అదే ఊపులో ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. త్వరలోనే సెట్స్ పైకి రాబోతున్న ఈ సినిమాతో మరో కేరళ కుట్టి తెలుగు తెరపై మెరవబోతోంది. తమిళనాట పాపనాశం, జిల్లా లాంటి హిట్ సినిమాల్లో నటించిన నివేద థోమస్ అనే భామను నాని కొత్త సినిమా కోసం సంప్రదించారు. కథ నచ్చడంతో నివేద ఇందులో నటించేందుకు ఒప్పుకుంది. ఇప్పటికే ఓ కేరళ కుట్టి నిత్యామీనన్ తెలుగునాట చాలా పాపులర్ అయింది. ఇదే బాటలో నివేద కూడా పేరు తెచ్చుకుంటుందని ఆశిస్తున్నారు. నాని చేయబోతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా ఇప్పటికే సురభిని సెలక్ట్ చేశారు. ఇప్పుడు తాజాగా నివేదను ఎంచుకున్నారు. అంటే.. తన తాజా చిత్రంలో నాని ఇద్దరమ్మాయిలతో రొమాన్స్ చేయబోతున్నాడన్నమాట. ప్రస్తుతం నాని సినిమాతోపాటు శర్వానంద్, నవీన్ చంద్ర సినిమాల్లో కూడా నటించేందుకు ఒప్పుకుంది నివేద. వీటిలో ఏది మొదట విడుదలవుతుందో చూడాలి.
First Published:  3 Oct 2015 7:03 PM GMT
Next Story