Telugu Global
Others

నెంబర్ 2 ఎవరంటే...

మంత్రి హరీష్ రావుకు నాకు పోటీ కేవలం నియోజకవర్గాల అభివృద్ధి విషయంలో మాత్రమే. ఇదీ మరో  మంత్రి కేటీఆర్ మాట. తమ మధ్య ఎలాంటి రాజకీయ పోటీ లేదని అభివృద్ధి విషయంలో పోటీ ఉంటే ఎలాంటి తప్పు లేదన్నారు. ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలూ లేవని కేటీఆర్ స్పష్టం చేశారు. భవిష్యత్తులో కూడా ఇద్దరం కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తామని కేటీఆర్ సిరిసిల్లలో చెప్పారు. ఇంత వరకు బాగానే ఉంది. ఇద్దరి మధ్య ఎలాంటి రాజకీయపరమైన పోటీ లేకపోవచ్చు. […]

నెంబర్ 2 ఎవరంటే...
X

మంత్రి హరీష్ రావుకు నాకు పోటీ కేవలం నియోజకవర్గాల అభివృద్ధి విషయంలో మాత్రమే. ఇదీ మరో మంత్రి కేటీఆర్ మాట. తమ మధ్య ఎలాంటి రాజకీయ పోటీ లేదని అభివృద్ధి విషయంలో పోటీ ఉంటే ఎలాంటి తప్పు లేదన్నారు. ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలూ లేవని కేటీఆర్ స్పష్టం చేశారు. భవిష్యత్తులో కూడా ఇద్దరం కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తామని కేటీఆర్ సిరిసిల్లలో చెప్పారు. ఇంత వరకు బాగానే ఉంది. ఇద్దరి మధ్య ఎలాంటి రాజకీయపరమైన పోటీ లేకపోవచ్చు. కానీ పార్టీలో, కొందరు నాయకుల్లోనూ, సామాన్య కార్యకర్తల్లోనూ ఇప్పటికీ చర్చ జరుగుతూనే ఉంది.

ఇద్దరు మంత్రుల మధ్య స్వచ్ఛ తెలంగాణ కార్యక్రమం పోటీని మరింత పెంచిందని పార్టీ వర్గాలు అంటున్నాయి.

రాష్ట్రంలో మరే నియోజకర్గంలో లేనంతగా కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న సిరిసిల్లను స్వచ్ఛ సిరిసిల్ల పేరుతో 100శాతం మరగుదొడ్లు నిర్మించినట్టు ప్రకటించారు.
అటు హరీష్ రావు కూడా తన నియోజకవర్గం సిద్దిపేటను కూడా శుద్ధిపేటగా మార్చేశానని ప్రకటించారు. అంతకుముందు సీఎం కేసీఆర్ చైనా పర్యటనకు వెళ్లినపుడు కూడా ఇద్దరు మంత్రులు పోటాపోటీగా పాలనను పరుగులు పెట్టించారు. కేటీఆర్ అధికారిక కార్యక్రమాలను చూసుకుంటే.. హరీష్ రావు పార్టీతోపాటు రాజకీయ వ్యవహారాలను పర్యవేక్షించారని గులాబీ నేతలు చెబుతున్నారు.
నిజానికి చాలా కాలంగా పార్టీలో హరీష్ వర్గం, కేటీఆర్ వర్గం అనేవి ఉన్నాయన్న విషయం పార్టీలో ప్రతిఒక్కరికీ తెలుసు. అయితే అదంతా కేసీఆర్ కనుసన్నల్లోనే ఉంటుంది కాబట్టి ఎప్పుడూ ఇబ్బందులు తలెత్తలేదు. కానీ భవిష్యత్తులో మాత్రం ఇద్దరిలో ఎవరు నెంబర్ 2 అన్నది తేల్చాల్సిన అవసరం రాకమానదు. ఆ సమయం కోసమే ఇద్దరూ వ్యూహాత్మకంగా తమ అనుచరులు, నేతలను కాపాడుకుంటూ వస్తున్నారన్న ప్రచారమూ ఉంది. మొత్తం మీద పార్టీలో, ప్రభుత్వంలో నెంబర్ 2 ఎవరన్న చర్చ గులాబీ దళంలో జోరుగా నడుస్తోంది.

First Published:  4 Oct 2015 3:08 AM GMT
Next Story