Telugu Global
National

న్యూట్రిన్ చాక్లెట్ ఇక కనుమరుగు

న్యూట్రిన్ చాక్లెట్స్. ఈ పేరు తెలియని వారు ఉండరు. చిన్న పిల్లల దగ్గర్నుంచి  పెద్దల వరకు ఇష్టపడతారు. సుమారు 60 సంవత్సరాలకుపైగా కస్టమర్ల ఆదరాభిమానులు పొందుతూ వస్తున్న న్యూట్రిన్స్ చాక్లెట్ కంపెనీ ఇప్పుడు లౌకౌట్ దిశాగా అడుగులేసింది. కంపెనీ నెలసరి ఉత్పత్తి 4వేల టన్నుల నుంచి 400 టన్నులకు పడిపోవడంతోపాటు ఐటీసీ నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకునే పరిస్థితిలేక పోవడం, నష్టాలను భరించే పరిస్థితి లేదని యాజమాన్యం ప్రకటించింది. అక్టోబర్ నుంచి ఫ్యాక్టరీని నడపలేమని సిబ్బందికి నోటీసులు […]

న్యూట్రిన్ చాక్లెట్ ఇక కనుమరుగు
X

న్యూట్రిన్ చాక్లెట్స్. ఈ పేరు తెలియని వారు ఉండరు. చిన్న పిల్లల దగ్గర్నుంచి పెద్దల వరకు ఇష్టపడతారు. సుమారు 60 సంవత్సరాలకుపైగా కస్టమర్ల ఆదరాభిమానులు పొందుతూ వస్తున్న న్యూట్రిన్స్ చాక్లెట్ కంపెనీ ఇప్పుడు లౌకౌట్ దిశాగా అడుగులేసింది. కంపెనీ నెలసరి ఉత్పత్తి 4వేల టన్నుల నుంచి 400 టన్నులకు పడిపోవడంతోపాటు ఐటీసీ నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకునే పరిస్థితిలేక పోవడం, నష్టాలను భరించే పరిస్థితి లేదని యాజమాన్యం ప్రకటించింది. అక్టోబర్ నుంచి ఫ్యాక్టరీని నడపలేమని సిబ్బందికి నోటీసులు జారీ చేసింది.
ఫ్యాక్టరీలో పని చేస్తున్న 295 మంది ఉద్యోగులు, కార్మికులను పిలిపించి సీనియారిటీ ఆధారంగా బెనిఫిట్స్‌ చెల్లిస్తామని యాజమాన్యం స్పష్టం చేసింది. ఫ్యాక్టరీని మూసేసేందుకు యాజమాన్యం ప్రయత్నిస్తోందని కార్మికులు ఆందోళనకు దిగారు.
చిత్తూరు జిల్లాకు చెందిన బివి రెడ్డి న్యూట్రిన్‌ 1952లో ఫ్యాక్టరీని ప్రారంభించారు. 1964లో బివి రెడ్డి మరణించారు. ఆయన మరణంతో కుమారుడు ద్వారక నాథరెడ్డి కంపెనీ బాధ్యతలు చేపట్టారు. తర్వాత ఆయన ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపడంతో కంపెనీ బాధ్యతలు కుమారుడు విక్రమ్‌రెడ్డికి అప్పగించారు. ఆయన నేతృత్వంలో కంపెనీ రూ.150 కోట్ల టర్నోవర్‌కు చేరుకుంది. బిస్కట్లు, క్యాండీలు, గమ్స్‌, హనీఫాబ్‌, నాచురోఫుడ్‌ బార్‌ ఇలా 40 రకాల ఉత్పత్తులతో 2,700 మంది ఉద్యోగులు, కార్మికులతో చాక్‌లెట్ల తయారీలో అగ్రగామిగా ఆవిర్భవించింది.
2004లో న్యూట్రిన్‌ కంపెనీని బివి రెడ్డి కుటుంబం నుంచి గోద్రెజ్ సంస్థ కొనుగోలు చేసింది. 2007లో గోద్రెజ్‌ నుంచి హెర్షీస్‌ యాజమాన్యం చేతికి వెళ్లింది. ఇటీవల నష్టాలకు గురైన కంపెనీ క్రమంగా ఒక్కో ఉత్పత్తినీ ఆపేస్తూ వచ్చింది. మొత్తం మీద దశాబ్దాలపాటు చిత్తూరు జిల్లాకు పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టిన న్యూట్రిన్ చాక్లెట్ ఫ్యాక్టరీ ఇప్పుడు మూసేసే పరిస్థతికి రావడంపై జిల్లా వాసులు ఆవేదన వ్యక్తం చేశారు.

First Published:  3 Oct 2015 3:34 PM GMT
Next Story