Telugu Global
Others

అడిషనల్‌ డీజీపీ ఇంట్లో పాము కలకలం

అడిషనల్ డీజీపీ ఇంట్లో ఓ పాము కలకలం సృష్టించింది. లక్డీకపూల్‌లోని తెలంగాణ డీజీపీ కార్యాలయం సమీపంలోని భవనంలో అడిషనల్ డీజీపీ (లా అండ్ ఆర్డర్) సుదీప్ లక్తాకియా నివాసం ఉంటున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఆ ఇంట్లోకి పాము ప్రవేశించింది. దీన్ని గమనించిన సెక్యూరిటీ సిబ్బంది విషయాన్ని ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ సభ్యుడు, పాముల పట్టడంలో దిట్ట అయిన చిలకలగూడ పోలీస్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న వెంకటేష్ నాయక్‌కు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న […]

అడిషనల్ డీజీపీ ఇంట్లో ఓ పాము కలకలం సృష్టించింది. లక్డీకపూల్‌లోని తెలంగాణ డీజీపీ కార్యాలయం సమీపంలోని భవనంలో అడిషనల్ డీజీపీ (లా అండ్ ఆర్డర్) సుదీప్ లక్తాకియా నివాసం ఉంటున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఆ ఇంట్లోకి పాము ప్రవేశించింది. దీన్ని గమనించిన సెక్యూరిటీ సిబ్బంది విషయాన్ని ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ సభ్యుడు, పాముల పట్టడంలో దిట్ట అయిన చిలకలగూడ పోలీస్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న వెంకటేష్ నాయక్‌కు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న నాయక్ అరగంటపాటు శ్రమించి ఆరు అడుగులున్న జెర్రిపోతును పట్టుకున్నాడు. దీంతో అడిషనల్ డీజీపీ కుటుంబ సభ్యులు, సెక్యూరిటీ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.

First Published:  3 Oct 2015 1:14 PM GMT
Next Story