తుపానుకు అతలాకుతలమైన పిలిప్పీన్స్‌

ముజిగే తుపాను కారణంగా పిలిప్పీన్స్‌ మొత్తం అతలాకుతలమైంది. మృతులు ఇద్దరే అయినా దాదాపు రెండు లక్షల మంది నిరాశ్రయులయ్యారు. వేటకు సముద్రంలోకి వెళ్ళిన జాలర్లు 120 మంది గల్లంతయ్యారు. 23 పడవల్లో వెళ్ళిన వీరి జాడ తెలియకుండా పోయింది. మెరెన్‌ సిబ్బంది వీరి కోసం హెలికాప్టర్లలో గాలిస్తున్నారు. తుపాను బారిన పడిన బాధితులకు ఆశ్రయం కల్పించే చర్యల్లో సహాయ సిబ్బంది తలమునకలై ఉన్నారు.