కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

కాశ్మీర్‌లో పోలీసులు, భద్రతాదళాలు చేపట్టిన సంయుక్త ఆపరేషన్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మృతులు జైషే-ఇ-మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఆదిల్ పఠాన్, బుర్మిలుగా గుర్తించారు. భారత భూభాగంలోకి ఉగ్రవాదులు చొరబడ్డారన్న నిఘా వర్గాల సమాచారం మేరకు జవాన్లు స్థానిక పోలీసులతో కలిసి నేడు జమ్ముకాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో గాలింపు చర్యలు చేపట్టారు. గాలింపు చర్యలను పసిగట్టిన ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడడంతో అప్రమత్తమైన భద్రతా దళాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.