చైనాలో త్వరలో 16 స్పాంజి నగరాలు

చైనా ప్రభుత్వం 16 నగరాలను స్పాంజి నగరాలుగా మార్చాలని నిర్ణయం తీసుకుంది. దీనికోసం వచ్చే మూడేళ్లలో ఒక్కో నగరానికి గాను 600 మిలియన్ల యువాన్లు అందుకోనుంది. ఈ నిధులతో కొలనులు, ఫిల్టరేషన్ పూల్స్, వెట్ ల్యాండ్స్‌తో పాటు స్పాంజి రోడ్లు (పర్మియబుల్ రోడ్స్) నిర్మించనుంది. ఈ ప్రణాళిక వల్ల 60శాతం వర్షపు నీటిని నియంత్రించవచ్చేనది అక్కడి అధికారుల అంచనా. ఇది కొంచెం ఎక్కువ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం.స్పాంజి రోడ్లు సగటున ఒక్కో చదరపు మీటరుకు నిమిషానికి 600 లీటర్ల నీటిని పీల్చుకోగలవు. ఈ రోడ్లు వర్షపు నీటిని పీల్చుకోవడం ద్వారా వరద నియంత్రణకు సహకరిస్తాయి. భూగర్భ నిల్వలు పెంచడంలో సహాయపడతాయి.