Telugu Global
Others

వారణాసిలో ఉద్రిక్తత... కర్ప్యూ

ప్రధాని మోడీ నియోజకవర్గం వారణాసిలో మరోసారి హింస తలెత్తింది. గంగానదిలో గణేశ విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు అనుమతించాలంటూ సెప్టెంబర్ 22న శాంతియుత ఆందోళన చేసిన సాధువులపై పోలీసులు లాఠీఛార్జ్ జరిపారు. నాటి ఘటనలో పలువురు సాధువులు గాయపడ్డారు. నాటి ఘటనకు వ్యతిరేకంగా సోమవారం వారణాసిలో వేలాది మంది సాధువులు, వారి మద్దతుదారులు ర్యాలీ నిర్వహించారు. గొడౌలియా వద్దకు ర్యాలీ చేరుకున్నాక పోలీసులు ర్యాలీ నిర్వహిస్తున్నవారిపై లాఠీఛార్జ్ జరిపారు. దీంతో ఆందోళనకారులు రెచ్చిపోయారు. పోలీసుల వాహనాలను దగ్ధం చేశారు. […]

ప్రధాని మోడీ నియోజకవర్గం వారణాసిలో మరోసారి హింస తలెత్తింది. గంగానదిలో గణేశ విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు అనుమతించాలంటూ సెప్టెంబర్ 22న శాంతియుత ఆందోళన చేసిన సాధువులపై పోలీసులు లాఠీఛార్జ్ జరిపారు. నాటి ఘటనలో పలువురు సాధువులు గాయపడ్డారు. నాటి ఘటనకు వ్యతిరేకంగా సోమవారం వారణాసిలో వేలాది మంది సాధువులు, వారి మద్దతుదారులు ర్యాలీ నిర్వహించారు. గొడౌలియా వద్దకు ర్యాలీ చేరుకున్నాక పోలీసులు ర్యాలీ నిర్వహిస్తున్నవారిపై లాఠీఛార్జ్ జరిపారు. దీంతో ఆందోళనకారులు రెచ్చిపోయారు. పోలీసుల వాహనాలను దగ్ధం చేశారు. పోలీసులపైకి రాళ్లు రువ్వారు. పోలీసు బూత్‌కు నిప్పు పెట్టారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. కర్ఫ్యూ విధించారు.

First Published:  4 Oct 2015 1:07 PM GMT
Next Story