Telugu Global
NEWS

జీడిమెట్ల కెమికల్‌ గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్‌లోని జీడిమెట్లలో పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కెమికల్‌ గోడౌన్‌లో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ప్రమాదానికి కారణాలు తెలియకపోయినప్పటికీ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా జరిగి ఉంటుందని భావిస్తున్నారు. దీనిలో కుట్ర ఏదైనా దాగి ఉందా అనే విషయంపైన కూడా ఆరా తీస్తున్నారు. ఎగిసిపడుతున్న మంటలు విస్తరించడంతోను, ప్రమాదం జరిగిన సమయం రాత్రివేళ కావడంతోను ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. చుట్టుపక్కల వారిని ఇళ్ళ నుంచి బయటకు పంపిస్తున్నారు. ప్రమాదం విషయం తెలుసుకున్న అగ్నిమాపక […]

జీడిమెట్ల కెమికల్‌ గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం
X

హైదరాబాద్‌లోని జీడిమెట్లలో పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కెమికల్‌ గోడౌన్‌లో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ప్రమాదానికి కారణాలు తెలియకపోయినప్పటికీ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా జరిగి ఉంటుందని భావిస్తున్నారు. దీనిలో కుట్ర ఏదైనా దాగి ఉందా అనే విషయంపైన కూడా ఆరా తీస్తున్నారు. ఎగిసిపడుతున్న మంటలు విస్తరించడంతోను, ప్రమాదం జరిగిన సమయం రాత్రివేళ కావడంతోను ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. చుట్టుపక్కల వారిని ఇళ్ళ నుంచి బయటకు పంపిస్తున్నారు. ప్రమాదం విషయం తెలుసుకున్న అగ్నిమాపక దళాలు పెద్ద ఎత్తున రంగంలోకి దిగుతున్నాయి. ఈ ప్రమాదంలో మృతులెవరూ లేరని భావిస్తున్నారు. అయితే అగ్ని ప్రమాదంలో ఎవరైనా ఇరుక్కున్నారా అనే విషయం కూడా తెలియవలసి ఉంది.

First Published:  5 Oct 2015 11:39 AM GMT
Next Story