Telugu Global
NEWS

అగ్రిగోల్డ్ ఆస్తుల విక్రయానికి కమిటీ: హైకోర్టు

అగ్రిగోల్డ్ బాధితులకు బాధితులందరికీ డబ్బు చెల్లించేలా ఉమ్మడి హైకోర్టు నిర్ణయం తీసుకుంది. అగ్రిగోల్డ్‌కు సంబంధించిన ఆస్తుల విక్రయానికి రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కమిటీ వేయాలని హైకోర్టు నిర్ణయించింది. ఈ కమిటీకి సభ్యుల పేర్లు సూచించాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ కేసు మొదలైనప్పటి నుంచీ ఈ రోజు వరకు కేసుకు సంబంధించి అగ్రిగోల్డ్ చైర్మన్, ఇతర డైరెక్టర్లు ఎవరూ కోర్టుకు హాజరు కాకపోవడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. సంస్థ చైర్మన్ సహా, ఇతర […]

అగ్రిగోల్డ్ ఆస్తుల విక్రయానికి కమిటీ: హైకోర్టు
X

అగ్రిగోల్డ్ బాధితులకు బాధితులందరికీ డబ్బు చెల్లించేలా ఉమ్మడి హైకోర్టు నిర్ణయం తీసుకుంది. అగ్రిగోల్డ్‌కు సంబంధించిన ఆస్తుల విక్రయానికి రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కమిటీ వేయాలని హైకోర్టు నిర్ణయించింది. ఈ కమిటీకి సభ్యుల పేర్లు సూచించాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ కేసు మొదలైనప్పటి నుంచీ ఈ రోజు వరకు కేసుకు సంబంధించి అగ్రిగోల్డ్ చైర్మన్, ఇతర డైరెక్టర్లు ఎవరూ కోర్టుకు హాజరు కాకపోవడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. సంస్థ చైర్మన్ సహా, ఇతర డైరెక్టర్లు కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు ఇవాళ ఉదయం సంస్థ చైర్మన్ సహా ఇతర డైరెక్టర్లు కోర్టుకు హాజరయ్యారు.

విచారణలో భాగంగా బాధితులకు సంస్థ ఎంతమేరకు డబ్బు ఇవ్వాలనేదానిపై కోర్టులో బలంగా వాదోపవాదనలు జరిగాయి. సంస్థ మొత్తంగా రూ. 7వేల కోట్లకుపైగా డిపాజిటర్లకు, ఏజెంట్లకు ఇవ్వాల్సి ఉందని హైకోర్టు గుర్తించింది. అగ్రిగోల్డ్‌కు సంబంధించి బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, ఏపీ, తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న ఆస్థుల వివరాలన్నింటినీ కూడా ఇవ్వాలని హైకోర్టు.. అగ్రి యాజమాన్యాన్ని ఆదేశించింది. ఆ ఆస్తుల విలువ ఎంత ఉంటుంది. ఎంతమేరకు వాటిని విక్రయించి బాధితులకు చెల్లిస్తారని యాజమాన్యాన్ని కోర్టు ప్రశ్నించింది.

ఈ నేపథ్యంలోనే కేసు దర్యాప్తు తీరుపట్ల కూడా ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక దశలో దర్యాప్తు చేస్తున్న అధికారి తీరు సరిగాలేదని వ్యాఖ్యానించింది. కేసు విచారణ రేపటికి వాయిదా వేసింది. డిపాజిటర్లకు డబ్బులు చెల్లించేందుకు విధివిధానాలను ఈ కమిటీ రూపొందిస్తుందని న్యాయస్థానం వెల్లడించింది. అలాగే ఈ కేసులో తమకు సూచనలు, సలహాలు కూడా ఇస్తుందని తెలిపింది. హైకోర్టు నిర్ణయంపై బాధితులు హర్షం వ్యక్తం చేశారు.

First Published:  5 Oct 2015 4:33 AM GMT
Next Story