పెద్ద చేపల రిటర్నుపైనే ఐటీ కన్ను!

చిన్న మొత్తాల్లో పన్ను చెల్లించేవారి రీఫండ్‌లను నిలిపి వేయబోమని, సాధారణంగా వారి రిటర్నులను సైతం తనిఖీ కోసం ఎంపిక చేయడం జరగదని ప్రత్యక్ష పన్నుల కేంద్రీయ బోర్డు(సీబీడీటీ) స్పష్టం చేసింది. సీబీడీటీ ఆదాయం పన్ను శాఖ అత్యున్నత నిర్ణయాధికార మండలి. స్మాల్ ట్యాక్స్‌ పేయర్లు సాధారణంగా ఈరెండు అంశాల్లోనే భయపడుతుంటారని, అందుకే వారి అపోహలను దూరం చేసే ప్రయత్నంలో భాగంగానే ఈ విషయాన్ని తెలియజేస్తున్నామని సీబీడీటీ చైర్మన్ అనితా కపూర్ చెప్పారు. ఒకసారి రిటర్నులు దాఖలు చేశామంటే ఇక ఎప్పుడూ తమపై ఐటీ శాఖ నిఘా ఉంటుందన్న అపోహ వారిలో ఉందన్నారు. అయితే సరైన, స్పష్టమైన, సమగ్ర వివరాలతో రిటర్నులు దాఖలు చేసిన పక్షంలో.. గరిష్ఠంగా 6 నెలల్లో పన్ను చెల్లింపుదారులకు రీఫండ్ పంపించడం జరుగుతుందన్నారు.