మెరుగుపడిన ఇంద్రాణి ఆరోగ్యం

కూతురు షీనాబోరాను హత్య చేసిన కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జియా స్పృహలోకి వచ్చారు. ఆమె ప్రాణాపాయం నుంచి పూర్తిగా బయటపడ్డారని, చికిత్సకు స్పందిస్తున్నారని జేజే ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. నిన్నటి వరకు ఇంద్రాణి స్పృహలోకి రాకుండా అపస్మారకస్థితిలో ఉన్న ఆమెకు వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. అయితే శ్వాస తీసుకోవడంలో కొంత ఇబ్బంది ఉన్నందున ఆక్సిజన్‌ను అందిస్తున్నామని తెలిపారు. ఆమెను స్పృహలోకి తీసుకురావడానికి శాయశక్తుల డాక్టర్లు చేసిన ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి.