Telugu Global
NEWS

తరతరాలకు తరగని వెలుగు కాకా: కేసీఆర్‌

కాంగ్రెస్ కురు వృద్ధుడు, కేంద్ర మాజీ మంత్రి, తెలంగాణ దళిత నేత దివంగత జి.వెంకటస్వామి(కాకా) విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై ఆవిష్కరించారు. ఈ విగ్రహాన్ని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఆవిష్కరించారు. ఈ సందర్బంగా సీఎం మాట్లాడుతూ కాకా విగ్రహాన్ని ఆవిష్కరించినందుకు తనకెంతో ఆనందంగా ఉందన్నారు. పేదలు, దళితుల జీవితాల్లో వెలుగులు చిందించిన వ్యక్తి అని, ఆయన అహర్నిశలు వారి కోసం శ్రమించారని తెలిపారు. కాకా చేసిన సేవలను కొనియాడారు. వెంకటస్వామి రాజకీయ భీష్ముడు అని కితాబిచ్చారు. సుధీర్ఘ రాజకీయ చరిత్ర, […]

తరతరాలకు తరగని వెలుగు కాకా: కేసీఆర్‌
X

కాంగ్రెస్ కురు వృద్ధుడు, కేంద్ర మాజీ మంత్రి, తెలంగాణ దళిత నేత దివంగత జి.వెంకటస్వామి(కాకా) విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై ఆవిష్కరించారు. ఈ విగ్రహాన్ని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఆవిష్కరించారు. ఈ సందర్బంగా సీఎం మాట్లాడుతూ కాకా విగ్రహాన్ని ఆవిష్కరించినందుకు తనకెంతో ఆనందంగా ఉందన్నారు. పేదలు, దళితుల జీవితాల్లో వెలుగులు చిందించిన వ్యక్తి అని, ఆయన అహర్నిశలు వారి కోసం శ్రమించారని తెలిపారు. కాకా చేసిన సేవలను కొనియాడారు. వెంకటస్వామి రాజకీయ భీష్ముడు అని కితాబిచ్చారు. సుధీర్ఘ రాజకీయ చరిత్ర, అపారమైన అనుభవం ఉన్న నిజమైన తెలంగాణ బిడ్డ అని తెలిపారు. తెలంగాణ కోసం అహర్నిశలు కృషి చేశారని పేర్కొన్నారు. ట్యాంక్‌బండ్‌పై కాకా విగ్రహాన్ని పెట్టుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. అంబేద్కర్‌ పార్కులో జరిగిన ఈ కార్యక్రమానికి స్పీకర్ మధుసూధనాచారి, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, కాకా కుమారులు వినోద్, వివేక్‌ హాజరయ్యారు. విగ్రహావిష్కరణ సందర్భంగా ట్యాంక్‌బండ్‌ పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్‌ను పూర్తిగా నిలిపేశారు. భారీగా ట్రాఫిక్ స్తంభించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 1969 తెలంగాణ ఉద్యమంలో బుల్లెట్ దెబ్బ తగిలినా భయపడకుండా ముందుకు వెళ్లారని గుర్తు చేశారు. తెలంగాణ ప్రస్తావన వస్తే చాలు అవును తెలంగాణ రాకూడదా, తెలంగాణ రావాల్సిందేనని కరాఖండిగా చెప్పేవారని గుర్తు చేశారు. చిన్నస్థాయి నుంచి పెద్ద స్థాయికి మామూలు మనుషులు కూడా ఎదగగలరనడానికి వెంకటస్వామి ఓ నిదర్శనమన్నారు. ఎవరెస్టు శిఖరమంత ఎత్తు ఎదిగిన దళిత నేత కాకా అని శ్లాఘించారు.

First Published:  5 Oct 2015 4:48 AM GMT
Next Story