కేసీఆర్‌ది దృతరాష్ట్రుడి పాత్ర: శ్రవణ్

తెలంగాణ మంత్రులు దొంగనోట్లు, గ్రానైట్‌, ఇసుక దందాలు చేస్తున్నారని కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్‌ ఆరోపించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికారపార్టీ నేతలు దోచుకోవడమే లక్ష్యంగా పని చేస్తున్నారని ధ్వజమెత్తారు. దందాలు చేస్తూ సత్యహరిశ్చంద్ర వారసులుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. మంత్రుల దందాపై కేసీఆర్‌ ఎందుకు మౌనం వహిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్‌ దృతరాష్ట్రుడి పాత్రను పోషిస్తున్నారని శ్రవణ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.