శ్రీ రాముడు, శ్రీ కృష్ణుడు మాంసాహారులే: గరికపాటి

రాముడు, కృష్ణుడు మాంసాహారులేనని ప్రఖ్యాత పురాణ ప్రవచనకర్త శ్రీ గరికపాటి నరసింహారావు అన్నారు. ధార్మికోపన్యాసం చేస్తూ ఆయన కొంతమంది పురాణ ప్రవచనకర్తలు మాంసాహారం మాని శాకాహారం తినమంటున్నారని ఇది మంచిది కాదని చెప్పారు.
బ్రాహ్మణులు తినకపోతే పోయారు మిగతావాళ్ళను వద్దనడం ఎందుకు? బ్రాహ్మణేతరులను మాంసం తినవద్దని చెప్పి మా బ్రాహ్మణులు కొందరు మాంసాహారం తినడం మొదలెట్టారని వ్యంగ్యంగా వ్యాఖ్యాంనించారు.
శాకాహారానికి ఆధ్యాత్మికతకు సంబంధం లేదని, దేశానికి ధర్మపన్నాలు చెప్పేవాళ్ళే కాదు వీరులు కూడా కావాలని అందుకే మాంసాహారాన్ని నిషేధించనవసరం లేదని అన్నారు.