విదేశీ ప్రతినిధుల సాక్షిగా టీడీపీ ఎమ్మెల్యే వీరంగం

ఉన్నతాధికారి పట్ల అధికార టీడీపీ ఎమ్మెల్యే ఒకరు ఆధిపత్యాన్ని ప్రదర్శించడమేకాక అనుచితంగా ప్రవర్తించి ఏపీ పరువు తీశారు. సచివాలయంలోని మున్సిపల్ శాఖ కార్యదర్శి కరికాల వలవన్ కార్యాలయానికి వచ్చిన విశాఖపట్టణం నగరం తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు.. అక్కడ వీరంగం సృష్టించారు. కరికాల వలవన్ ఛాంబర్‌లో విదేశీ ప్రతినిధులతో సమావేశమై ఉండగా.. వెలగపూడి ఆకస్మాత్తుగా ప్రవేశించి తనకు అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదంటూ ఆయనపై నిప్పులు చెరిగారు. అంతటితో ఆగక… పేషీ సిబ్బందిపై ఫైళ్లను విసిరికొట్టారు. నీళ్ల గ్లాసును నేలకేసి బద్దలు కొట్టారు. ఎమ్మెల్యే తీరుతో కార్యాలయ సిబ్బందికేకాక విదేశీయులు సైతం ఆశ్యర్యానికి గురయ్యారు.