పసికందు గొంతు పిసికే రాజకీయం: టీఆర్‌ఎస్‌

పదహారునెలల టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనే పసికందు గొంతు పిసికి చంపేయాలని విపక్షాలన్నీ ఏకమయ్యాయని ఆపార్టీ ఎమ్మెల్యే శ్రీనివాసగౌడ్‌ విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌, టీడీపీ, బీజేపీ, వామపక్షాలు… ఇలా అన్ని పార్టీలు ఏకమవ్వడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. కేంద్రంలో కాలు దువ్వుకునే కాంగ్రెస్‌, బీజేపీలు ఇక్కడ కలిసి పని చేస్తాయా… కాంగ్రెస్‌ కార్యాలయానికి బీజేపీ… బీజేఎల్పీ సమావేశానికి కాంగ్రెస్‌ నాయకులు వెళతారా? ఇదేం చోద్యం అని ప్రశ్నించారు. కేంద్రంలో కయ్యం, రాష్ట్రంలో వియ్యం భలే గమ్మత్తయిన నాయకులు అంటూ విమర్శించారు. రైతు యూనిట్‌గా పంటల భీమా ఇవ్వమంటే కేంద్రం ఇవ్వడం లేదని, ఇలాంటి విషయాలపై విపక్షాలు కలిసి సాదిస్తే సంతోషిస్తామని ఆయన అన్నారు.