Telugu Global
Others

మోదీ మోసం చేశాడు: రాంజెఠ్మ‌లానీ

సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది – రాజ్యసభ సభ్యుడు రాంజెఠ్మలానీ  మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. విదేశీ బ్యాంకుల్లో భారతీయులు దాచుకున్న నల్లధనాన్ని వెనుకకు తేవడంలో విఫలమైన ఎన్డీయే కూటమిని ఓడించాలని బీహారీలకు ఆయ‌న‌ పిలుపునిచ్చారు. తాను మోదీ, అరుణ్‌జైట్లీల మోసానికి బ‌ల‌య్యాయ‌ని వాపోయారు. త‌న‌లా మోస‌పోవ‌ద్ద‌ని  బీహారీల‌ను హెచ్చ‌రించారు. ఆదివారం పాట్నాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయ‌న మోదీ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు దేశ నేతగా మోదీని ప్రోత్సహించినందుకు పశ్చాత్తాపం తెలిపేందుకే […]

మోదీ మోసం చేశాడు: రాంజెఠ్మ‌లానీ
X

సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది – రాజ్యసభ సభ్యుడు రాంజెఠ్మలానీ మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. విదేశీ బ్యాంకుల్లో భారతీయులు దాచుకున్న నల్లధనాన్ని వెనుకకు తేవడంలో విఫలమైన ఎన్డీయే కూటమిని ఓడించాలని బీహారీలకు ఆయ‌న‌ పిలుపునిచ్చారు. తాను మోదీ, అరుణ్‌జైట్లీల మోసానికి బ‌ల‌య్యాయ‌ని వాపోయారు. త‌న‌లా మోస‌పోవ‌ద్ద‌ని బీహారీల‌ను హెచ్చ‌రించారు. ఆదివారం పాట్నాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయ‌న మోదీ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు దేశ నేతగా మోదీని ప్రోత్సహించినందుకు పశ్చాత్తాపం తెలిపేందుకే నేను ఈరోజు ఇక్కడకు వచ్చాన‌న్నారు. న‌ల్ల‌ధ‌నాన్ని వెనక్కి తీసుకురావ‌డంలో విఫ‌ల‌మైన అరుణ్ జైట్లీ, చిదంబ‌రంల‌ను ముందు అరెస్టు చేయాల‌ని డిమాండ్ చేశారు. నల్లధనాన్ని రప్పిస్తే మాజీ సైనికులకు వన్‌ర్యాంక్ వన్ పెన్షన్ వంటి విధానాల అమలుతోపాటు దేశ సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. ఆరెస్సెస్ చెప్పింద‌ని దేశంలో రిజ‌ర్వేష‌న్ల ప్ర‌క్రియ‌ను స‌మీక్షించ‌లేమ‌ని స్ప‌ష్టం చేశారు.. వెనుకబడిన కులాల వారు ఇతరులతో పోటీ పడేస్థాయికి వచ్చే వరకు రిజర్వేషన్లు అమలు చేయాల్సిందేనన్నారు.

First Published:  5 Oct 2015 12:28 AM GMT
Next Story