సోమ్‌నాథ్ భారతి రిమాండ్ 19 వరకూ పొడిగింపు

భార్య లిపికా మిత్రపై హత్య యత్నం, గృహహింస తదితర ఆరోపణలపై అరెస్టైన ఆమ్ ఆద్మీపార్టీ ఎమ్మెల్యే, మాజీ న్యాయశాఖా మంత్రి సోమ్‌నాథ్ భారతి జుడీషియల్ రిమాండ్ అక్టోబర్ 19 వరకూ పొడిగించారు. అంతకుముందు బెయిల్ కోసం ఆయన పెట్టుకున్న పిటిషన్‌ను ద్వారకా కోర్టు తిరస్కరించింది. సోమ్‌నాథ్ భారతితో రాజీకి రాబోనని లిపికా మిత్రా స్పష్టం చేయడంతో ఆయన రిమాండ్‌ను పొడిగించారు. తొలుత లొంగిపోవడానికే నిరాకరించిన సోమ్‌నాథ్ భారతి తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు లొంగిపోయారు.