వైద్య విభాగంలో ముగ్గురికి నోబెల్ బహుమతులు

వైద్య విభాగంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతులు లభించాయి. విలియం క్యాంప్‌బెల్, సంతోషి, ఒమూరాలకు వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతికి ఎంపికైనట్టు నోబెల్ స్వీడిష్ అకాడమీ పేర్కొంది. మలేరియా, తామరపై వీరు పరిశోధనల ద్వారా చేసిన విశేష కృషికిగాను ఈ బహుమతికి ఎంపిక చేసినట్టు అకాడమీ తెలిపింది. కాగా ప్రముఖ శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబుల్ జ్ఞాపకార్థం ఆయన వర్ధంతి రోజు డిసెంబర్ 10న నోబుల్ స్వీడిష్ అకాడమీ ప్రతి సంవత్సరం ఈ బహుమతులను అందజేస్తుంది.