Telugu Global
Cinema & Entertainment

మంచువారి దర్శకుడితో నందమూరి హీరో

మంచు ఫ్యామిలీలోని ఇద్దరు హీరోలతో సినిమాలు చేశాడు దర్శకుడు వీరుపోట్ల. మంచు మనోజ్ తో బిందాస్ సినిమా తీసి మంచి హిట్ కొట్టాడు. తర్వాత మంచు విష్ణుతో దూసుకెళ్తా తీసి దాంతో కూడా మంచి విజయాన్నందుకున్నాడు. ఇప్పుడీ దర్శకుడు ఓ నందమూరి హీరోను ఆకర్షించాడు. అవును.. త్వరలోనే కల్యాణ్ రామ్ తో కలిసి వర్క్ చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు వీరుపోట్ల. వీళ్లిద్దరి మధ్య ఇప్పటికే కథాచర్చలు పూర్తయ్యాయి. త్వరలోనే అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వస్తుంది. ప్రస్తుతం కల్యాణ్ […]

మంచువారి దర్శకుడితో నందమూరి హీరో
X
మంచు ఫ్యామిలీలోని ఇద్దరు హీరోలతో సినిమాలు చేశాడు దర్శకుడు వీరుపోట్ల. మంచు మనోజ్ తో బిందాస్ సినిమా తీసి మంచి హిట్ కొట్టాడు. తర్వాత మంచు విష్ణుతో దూసుకెళ్తా తీసి దాంతో కూడా మంచి విజయాన్నందుకున్నాడు. ఇప్పుడీ దర్శకుడు ఓ నందమూరి హీరోను ఆకర్షించాడు. అవును.. త్వరలోనే కల్యాణ్ రామ్ తో కలిసి వర్క్ చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు వీరుపోట్ల. వీళ్లిద్దరి మధ్య ఇప్పటికే కథాచర్చలు పూర్తయ్యాయి. త్వరలోనే అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వస్తుంది. ప్రస్తుతం కల్యాణ్ రామ్ షేర్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ లో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా విడుదలైన తర్వాత మాత్రమే వీరుపోట్ల గురించి ఆలోచిస్తాడు. మరోవైపు వీరుపోట్ల కూడా మంచు మనోజ్ తో బిందాస్ సినిమా సీక్వెల్ తీసే పనిలో ఉన్నాడు. వీళ్ల ప్రస్తుత సినిమాలు ఓ కొలిక్కి వచ్చిన తర్వాత నయా మూవీపై ఓ ప్రకటన వచ్చే అవకాశముంది. ఈ ప్రాజెక్ట్ కు మరో విశేషం ఏంటంటే.. ఈసారి కల్యాణ్ రామ్ సినిమాను మంచు విష్ణు నిర్మించే అవకాశముంది.
First Published:  4 Oct 2015 7:03 PM GMT
Next Story