గ్రేటర్‌లో 6.35 లక్షల ఓట్లు తొలగింపు: భన్వర్‌లాల్‌

గ్రేటర్ హైదరాబాద్లో 6.35 లక్షలమంది పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించినట్టు ఎన్నికల ప్రధానాధికారి భన్వర్లాల్ తెలిపారు. ఓటర్ల తొలగింపు విషయంలో ఏమైనా అవకతవకలు జరిగితే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు భన్వర్లాల్ను కలిశారు. గ్రేటర్ హైదరాబాద్లో ఓటర్ల తొలగింపు విషయమై ఆయనకు ఫిర్యాదు చేశాయి. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్థానికంగా నివాసం ఉండని వారి పేర్లను మాత్రమే ఓటర్ల జాబితా నుంచి తొలిగించినట్టు తెలిపారు. ఈ విషయమై మరో 19 లక్షల మందికి నోటీసులు ఇచ్చామని చెప్పారు.

గ్రేటర్లో 6.35 లక్షల ఓట్లు తొలగింపు