కొరియర్‌ బాయ్‌లా గొలుసు దొంగతనం

ఇది కూడా గొలుసు దొంగతనమే. కాని దొంగతనం చేసిన విధానమే వేరు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో గో సంరక్షణ శాల సమీపంలో ఓ ఇంటికి కొరియర్‌ బాయ్‌లా ఓ కుర్రాడు వచ్చాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలి మెడలో మూడు కాసుల బంగారు గొలుసు ఉండడం గమనించాడు. కొరియర్‌ అంటూ ఓ యువకుడు ఇంటికి వచ్చాడు. వృద్ధురాలు ఒక్కామె ఇంట్లో ఉండడం గమనించిన అతను ఆమె మెడలో ఉన్న గొలుసును లాక్కెళ్ళిపోయాడు. ఆమె పేరు కూరపాటి అనసూయ. 80 సంవత్సరాల వృద్ధురాలు. కుటుంబసభ్యులంతా పనుల నిమిత్తం బయటకు వెళ్ళిన సమయంలో ఈ సంఘటన జరిగింది. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు ఏలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.