Telugu Global
CRIME

చైన్‌ స్నాచర్లపై ఇక దోపిడీ కేసులు

చైన్ స్నాచర్లపై ఇక నుంచి దోపిడీ కేసులు నమోదు చేయాలని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్ మహేందర్‌రెడ్డి యంత్రాంగాన్ని ఆదేశించారు. బాధితులను గాయపరుస్తూ బంగారం దోపిడీ చేస్తున్నారు కాబట్టి స్నాచర్లపై ఐపీసీ 392 నమోదు చేసి కఠినమైన జైలు శిక్ష పడేలా చర్యలు చేపట్టాలని దిశా నిర్దేశనం చేశారు. ఇన్నాళ్లు స్నాచింగ్ ఘటనపై ఐపీసీ 382 కింద కేసు నమోదు చేసినా ఇకనుంచి దోపిడీ కేసులు వీటిని నమోదు చేయాలని ఆదేశించారు. ఇప్పటికే ముంబాయి, ఢిల్లీ, బెంగుళూర్‌లో స్నాచింగ్ […]

చైన్‌ స్నాచర్లపై ఇక దోపిడీ కేసులు
X

చైన్ స్నాచర్లపై ఇక నుంచి దోపిడీ కేసులు నమోదు చేయాలని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్ మహేందర్‌రెడ్డి యంత్రాంగాన్ని ఆదేశించారు. బాధితులను గాయపరుస్తూ బంగారం దోపిడీ చేస్తున్నారు కాబట్టి స్నాచర్లపై ఐపీసీ 392 నమోదు చేసి కఠినమైన జైలు శిక్ష పడేలా చర్యలు చేపట్టాలని దిశా నిర్దేశనం చేశారు. ఇన్నాళ్లు స్నాచింగ్ ఘటనపై ఐపీసీ 382 కింద కేసు నమోదు చేసినా ఇకనుంచి దోపిడీ కేసులు వీటిని నమోదు చేయాలని ఆదేశించారు. ఇప్పటికే ముంబాయి, ఢిల్లీ, బెంగుళూర్‌లో స్నాచింగ్ ఘటనలపై రాబరీ(దోపిడీ) కేసులుగా నమోదు చేస్తున్నారు. గతంలో జరిగిన స్నాచింగ్‌ల్లో మహిళలు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. దీంతో పోలీసులు కఠిన చర్యలకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఇప్పటికే స్నాచింగ్‌లకు పాల్పడిన 48 మందిపై కమిషనర్ పీడీ యాక్ట్ ప్రయోగించి కేసులు నమోదు చేశారు.

First Published:  5 Oct 2015 3:01 PM GMT
Next Story