Telugu Global
Cinema & Entertainment

చెర్రీకి అసంతృప్తి మిగిల్చిన చిరంజీవి..?

సినిమా అంటే  హీరోకు సంబంధించి క్యారెక్ట‌రైజేష‌న్   కొంత ర‌హ‌స్యంగా ఉంచాలి.  రిలీజ్ కు ముందే అంతా రీవిల్ చేస్తే ఏముంటుంది..? అభిమానులు ఎవ‌రికి తోచినట్లు.. వాళ్లు  ఊహించేసుకుంటారు.   ఈ విధ‌మైన అంచ‌నాలు ఒక్కోసారి సినిమాకు ప్ర‌మాదం అయ్యే అవ‌కాశం ఉంది.  తాజాగా రాంచ‌ర‌ణ్  న‌టించిన బ్రుసీలీ సినిమాకు సంబంధించి అంతా ఓపెన్ కావ‌డం తో రాంచ‌ర‌ణ్  చిరుబురులాడుతున్నార‌ని టాక్.  అక్టోబ‌ర్  2న బ్రుసీలి ఆడియో రిలీజ్ గ్రాండ్ గా  హైద‌రాబాద్ లో జ‌రిగిన విష‌యం […]

చెర్రీకి అసంతృప్తి మిగిల్చిన చిరంజీవి..?
X
సినిమా అంటే హీరోకు సంబంధించి క్యారెక్ట‌రైజేష‌న్ కొంత ర‌హ‌స్యంగా ఉంచాలి. రిలీజ్ కు ముందే అంతా రీవిల్ చేస్తే ఏముంటుంది..? అభిమానులు ఎవ‌రికి తోచినట్లు.. వాళ్లు ఊహించేసుకుంటారు. ఈ విధ‌మైన అంచ‌నాలు ఒక్కోసారి సినిమాకు ప్ర‌మాదం అయ్యే అవ‌కాశం ఉంది. తాజాగా రాంచ‌ర‌ణ్ న‌టించిన బ్రుసీలీ సినిమాకు సంబంధించి అంతా ఓపెన్ కావ‌డం తో రాంచ‌ర‌ణ్ చిరుబురులాడుతున్నార‌ని టాక్.
అక్టోబ‌ర్ 2న బ్రుసీలి ఆడియో రిలీజ్ గ్రాండ్ గా హైద‌రాబాద్ లో జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఆడియో రిలీజ కు ఇత‌ర మెగా హీరోలు ఎవ‌రు అటెండ్ కాలేదు. అయితే ఈ చిత్రంలో చిరు గెస్ట్ అప్పిరియ‌న్స్ ఇస్తున్న విష‌యం తెలిసిందే. అలాగే అల్లు అర‌వింద్ కూడా క‌నిపించ‌నున్నార‌ని తెలుస్తుంది. అయితే చిరు ఎలా కనపడతాడు…?
ఆయన చెప్పే డైలాగులు ఏంటి…? సీన్స్ ఎలా ఉండబోతున్నాయి అనే విషయమై చర్చ మొదలైంది. కానీ ఆడియో పంక్షన్ లో వక్తలు చెప్పినదాన్ని బట్టి అందరికీ ఓ క్లారిటీ వచ్చేసింది. దాంతో రామ్ చరణ్ హైలెట్ గా ఫీలవుతున్న విషయాలు రివీల్ అవటంతో చిరాకు పడుతున్నట్లు చెప్పుకుంటున్నారు. సినిమాకు సంబంధించి చిరంజీవి క్యారక్టరైజేషన్, కొన్ని డైలాగ్స్ రివీల్ చేయ‌డం ఎందుకు అనేది రాంచ‌ర‌ణ్ ఆలోచ‌న. ఇలా రివీల్ చేయటంతో చెర్రీ కొద్దిగ ఫీల్ అయినట్టు సమాచారం. అయితే సినిమా ఎలాగు ఈ నెల 16న రిలీజ్ అవుతుంది కాబ‌ట్టి.. మెయిన్ క్యారెక్ట‌ర్స్ గురించి ఒక అవుట్ లైన్ ఆడియ‌న్స్ కు ఇవ్వ‌డం ప్ల‌స్ అవుతుందని చిరు ఆశిస్తున్నారు. ఇలా చేయటం వలన అంచనాలు పెరగవని మెగాస్టార్ ఆలోచనట..అయితే రాంచ‌ర‌ణ్ స‌ర‌స‌న ర‌కుల్ ప్రీతిసింగ్ న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. శీను వైట్ల ఈ ప్రాజెక్ట్ ను ఎంతో ప్రిస్టిజియ‌స్ గా తెర‌కెక్కిస్తున్నారు. ఎందుకంటే మెగా హీరో సినిమా అంటే అంచ‌నాలు భారీగా వుంటాయి క‌దా.!
First Published:  5 Oct 2015 7:02 PM GMT
Next Story