Telugu Global
Others

సిటీ బస్‌ల సమయపాలనపై ఆర్టీసీ దృష్టి

హైదరాబాద్‌ నగరంలో బస్సుల సమయ పాలనపై ఆర్టీసీ దృష్టి పెట్టింది. ఒకేసారి బస్సు వెనక బస్సు వచ్చే విధానానికి పుల్‌స్టాప్‌ పెట్టనుంది. ప్రతి మూడు నిమిషాలకొక బస్సు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా కొత్తగా బస్సులను కొనే పరిస్థితి లేదు. ఉన్న వాటితోనే సమర్థవంతంగా బస్సుల నిర్వహణపై దృష్టి సారించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ పరిధిలో 28 డిపోలు ఉండగా ఆర్టీసీ బస్సులు 3651, అద్దె బస్సులు 169లతో కలిపి మొత్తం 3784 […]

హైదరాబాద్‌ నగరంలో బస్సుల సమయ పాలనపై ఆర్టీసీ దృష్టి పెట్టింది. ఒకేసారి బస్సు వెనక బస్సు వచ్చే విధానానికి పుల్‌స్టాప్‌ పెట్టనుంది. ప్రతి మూడు నిమిషాలకొక బస్సు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా కొత్తగా బస్సులను కొనే పరిస్థితి లేదు. ఉన్న వాటితోనే సమర్థవంతంగా బస్సుల నిర్వహణపై దృష్టి సారించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ పరిధిలో 28 డిపోలు ఉండగా ఆర్టీసీ బస్సులు 3651, అద్దె బస్సులు 169లతో కలిపి మొత్తం 3784 బస్సులు నగరంలో తిరుగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న రద్దీకి అనుగుణంగా బస్సులను నడపాలంటే ఇంకా 1300 బస్సుల అవసరం ఉంది. అన్ని బస్సులను ఒకేసారి కొనే స్థితిలో ఆర్టీసీ లేదు. ఇటీవలే 269 అద్దె బస్సులను నడిపేందుకు నోటిఫికేషన్‌ ఇచ్చి ఎంపిక చేసింది. ఈ బస్సులు కొన్ని రోజుల్లో నగరంలోని రోడ్డెక్కనున్నాయి. వీటిన్నింటితో ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా సమయ పాలనతో బస్సులు నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది.

First Published:  5 Oct 2015 1:06 PM GMT
Next Story