భారత్‌లో ఫేస్‌బుక్‌ హవా!

భారత్లో సోషల్ నెట్ వర్కింగ్ దిగ్గజం ఫేస్బుక్ నెంబర్‌ ఒన్‌ స్థానాన్ని ఆక్రమించింది. ఇది 51 శాతం యూజర్లతో దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్గా నిలిచింది. అదే విధంగా ఇన్స్టెంట్‌ మెసేజింగ్ యాప్స్ విషయంలో వాట్సాప్ 56 శాతం యూజర్లతో ముందంజలో ఉంది. ‘కనెక్టెడ్ లైఫ్’ పేరిట అంతర్జాతీయ రీసెర్చ్ కన్సల్టెన్సీ సంస్థ టీఎన్ఎస్ జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 50 దేశాలకు చెందిన 60,500 మంది ఇంటర్నెట్ యూజర్ల డిజిటల్ మనస్తత్వం, ప్రవర్తనలపై ఆధారంగా టీఎన్ఎస్ ఈ అధ్యయనం జరిపి ఓ నివేదిక వెల్లడించింది.