Telugu Global
NEWS

అగ్రిగోల్డ్‌పై 9న హైకోర్టు తుది తీర్పు

అగ్రిగోల్డ్‌కు చెందిన ప్రధాన ఆస్తులు ఐదింటిని విక్రయించేందుకు హైకోర్టు సూత్రప్రాయంగా అంగీకరించింది. సదరు ఆస్తులు విక్రయించగా వచ్చిన మొత్తాన్ని రిజిస్ట్రార్‌ పేరు మీద బ్యాంకు ఖాతా తెరిచి అందులో వేయాలని సూచించింది. అవసరమైతే మొత్తం సంస్థకున్న 300 ఆస్తులను విక్రయించి ఆ మొత్తాలను ఈ ఖాతాలో జమ చేయాలని ఆదేశించింది. ఈ ఆస్తుల వివరాలను హైకోర్టుకు అగ్రిగోల్డ్‌ సంస్థ మంగళవారం సమర్పిచింది. ఈకేసు విచారణ పూర్తిగా ముగిసినట్టేనని, వచ్చే శుక్రవారం తుది తీర్పు ఉంటుందని, ఆరోజు ఈ […]

అగ్రిగోల్డ్‌పై 9న హైకోర్టు తుది తీర్పు
X

అగ్రిగోల్డ్‌కు చెందిన ప్రధాన ఆస్తులు ఐదింటిని విక్రయించేందుకు హైకోర్టు సూత్రప్రాయంగా అంగీకరించింది. సదరు ఆస్తులు విక్రయించగా వచ్చిన మొత్తాన్ని రిజిస్ట్రార్‌ పేరు మీద బ్యాంకు ఖాతా తెరిచి అందులో వేయాలని సూచించింది. అవసరమైతే మొత్తం సంస్థకున్న 300 ఆస్తులను విక్రయించి ఆ మొత్తాలను ఈ ఖాతాలో జమ చేయాలని ఆదేశించింది. ఈ ఆస్తుల వివరాలను హైకోర్టుకు అగ్రిగోల్డ్‌ సంస్థ మంగళవారం సమర్పిచింది. ఈకేసు విచారణ పూర్తిగా ముగిసినట్టేనని, వచ్చే శుక్రవారం తుది తీర్పు ఉంటుందని, ఆరోజు ఈ కేసుతో సంబంధమున్న అధికారులు యాజమాన్యం హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. కాగా ఆస్తుల వివరాలపై ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని హైకోర్టు అగ్రిగోల్డ్‌ యాజమాన్యాన్ని ఆదేశించింది.

కోర్టును తప్పుదోవ పట్టిస్తే సహించం

ఆస్తుల విలువ ఎక్కువ చూపి కోర్టును తప్పుదోవ పట్టించాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని అగ్రిగోల్డ్‌ కేసులో ఆ సంస్థ ఛైర్మన్‌ను, డైరెక్టర్లను హైకోర్టు హెచ్చరించింది. బెంగుళూరులో తమకున్న 172 ఎకరాలు అమ్మితే 1500 కోట్లు, విజయవాడలో ఉన్న 170 ఎకరాలు అమ్మితే 1000 కోట్ల రూపాయలు వస్తాయని పేర్కొన్న విషయాన్ని ప్రస్తావిస్తూ తామేమన్నా కళ్ళకు గంతలు కట్టుకుని ఉన్నట్టు కనిపిస్తున్నామా అని న్యాయమూర్తి ఘాటుగా స్పందించారు. ఆస్తుల అమ్మకం వల్ల వచ్చే ఆదాయాన్ని అధికంగా చూపుతున్నారంటూ న్యాయవాది వాదనతో విభేదిస్తూ విజయవాడ, బెంగుళూరులో ఉన్న భూముల అమ్మకం వల్ల రూ.200 కోట్లకు మించి రాదని అన్నారు. కోర్టును తప్పుదోవ పట్టిస్తే చూస్తూ ఊరుకోమని, బినామీ ఆస్తులుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని కోర్టు హెచ్చరించింది. వరుసగా రెండో రోజు జరిగిన విచారణకు అగ్రిగోల్డ్‌ సంస్థ ఛైర్మన్‌, నలుగురు డైరెక్టర్లు, ఏపీ సీఐడీ చీఫ్‌ తదితరులు హాజరయ్యారు. ఆస్తుల విక్రయం, దీనికి సంబంధించి రూపొందించబోయే కమిటీ తదితర విషయాలను మధ్యాహ్నం మరోసారి కోర్టు విచారించనుంది.

First Published:  6 Oct 2015 4:45 AM GMT
Next Story