Telugu Global
National

రైల్వే ఈ టికెట్ బుకింగ్ టైమ్ పెంపు

ఐఆర్‌సీటీసీ త‌మ వినియోగ‌దారుల కోసం అద‌నపు స‌మ‌యం కేటాయించింది. రైల్వే ప్ర‌యాణం కోసం ఈ టికెట్ బుక్ చేసుకునేందుకు మ‌రో 15 నిమిషాల అద‌న‌పు స‌మ‌యాన్ని పెంచుతూ నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కూ రాత్రి 11 గంట‌ల 30 నిమిషాల వ‌ర‌కే ఈ టికెట్ బుక్ చేసుకునే అవ‌కాశం ఉండేది. తాజాగా తీసుకున్న నిర్ణ‌యం ప్ర‌కారం రాత్రి 11 గంట‌ల 45 నిమిషాల‌ వరకు ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకునే స‌దుపాయం అందుబాటులోకి వ‌స్తుంది. రాత్రి 11.30 నుంచి 12.30 […]

రైల్వే ఈ టికెట్ బుకింగ్ టైమ్ పెంపు
X

ఐఆర్‌సీటీసీ త‌మ వినియోగ‌దారుల కోసం అద‌నపు స‌మ‌యం కేటాయించింది. రైల్వే ప్ర‌యాణం కోసం ఈ టికెట్ బుక్ చేసుకునేందుకు మ‌రో 15 నిమిషాల అద‌న‌పు స‌మ‌యాన్ని పెంచుతూ నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కూ రాత్రి 11 గంట‌ల 30 నిమిషాల వ‌ర‌కే ఈ టికెట్ బుక్ చేసుకునే అవ‌కాశం ఉండేది. తాజాగా తీసుకున్న నిర్ణ‌యం ప్ర‌కారం రాత్రి 11 గంట‌ల 45 నిమిషాల‌ వరకు ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకునే స‌దుపాయం అందుబాటులోకి వ‌స్తుంది. రాత్రి 11.30 నుంచి 12.30 వ‌ర‌కూ వెబ్‌సైట్ మెయింటెనెన్స్ కోసం మెయిన్ స‌ర్వ‌ర్‌ను ష‌ట్‌డౌన్ చేసేవారు. అంటే గంట‌పాటు ఐఆర్‌సీటీసీ సైట్ అందుబాటులో ఉండేది కాదు. కొత్త‌గా నిర్ణ‌యించిన వేళ‌ల ప్ర‌కారం ఇది న‌ల‌భై ఐదు నిమిషాల‌కే ప‌రిమితం కానుంది. ఈ టికెట్ సేవ‌ల‌ను మ‌రింత మెరుగుప‌రిచేందుకు ఇటీవ‌లే సింగ‌పూర్ నుంచి ఐదు ఇంపోర్టెడ్ స‌ర్వ‌ర్ల‌ను ఇండియ‌న్ రైల్వేస్ దిగుమ‌తి చేసుకుంది. ఈ స‌ర్వ‌ర్ల వినియోగంతో మ‌రో 15 నిమిషాల అద‌న‌పు స‌మ‌యం కేటాయించ‌గ‌లిగామ‌ని ఐఆర్‌సీటీసీ వ‌ర్గాలు ప్ర‌కటించాయి.

First Published:  6 Oct 2015 2:21 AM GMT
Next Story